చమర్తి
తెలుగుదేశం విజయానికి జగన్మోహన్ రాజు నాయకత్వంలో కృషి చేస్తాం,
టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తిని ఘనంగా సత్కారించిన కూచివారిపల్లి గ్రామస్తులు,
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు సమచితస్థానం,
టిడిపికి అడ్డా
కూచివారి పల్లి
అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 07
( నవ్యాంధ్ర న్యూస్ )
తెలుగుదేశానికి కంచుకోటైన కూచువారిపల్లి గ్రామానికి,గ్రామ ప్రజలకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలుగుదేశం రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు
రాజంపేట టిడిపి కార్యాలయంలో ఆదివారం కూచువారిపల్లి మహిళలు,గ్రామస్తులు చమర్తిని ఘనంగా సత్కరించారు
ఈ సత్కారకార్యక్రమంలో మహిళలు పాల్గొని కూటమి ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న పథకాలపై హర్షం వ్యక్తం చేస్తూ, తెలుగుదేశం ఇన్చార్జిగా కార్యకర్తలకు అండగా ఉండే అందరివారైన చమర్తికి అధిష్టానం నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పడం ఆనందంగా ఉందన్నారు తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో టిడిపి విజయానికి మరింతగా కృషి చేసి తెలుగుదేశం జెండా రేపరేపా లాడేలా చేస్తామన్నారు అనంతరం గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ తెలుగుదేశం అండగా ఉన్న ప్రతి గ్రామాన్ని, ప్రతి నాయకుడిని,కార్యకర్తను సొంత కుటుంబ
సభ్యులుగా చూసుకుంటామని,కూచి వారిపల్లి గ్రామ ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కలుపుకుని పోతూ తెలుగుదేశం జెండా ఎగరవేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు
ఈ కార్యక్రమంలో కూచివారిపల్లి తెలుగుదేశం నాయకులు,మహిళా నాయకులు,కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు

