భాస్కర్ నాయుడిని కాటేసిన నాగుపాము
ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై టీటీడీ ఉద్యోగికి చికిత్స
ఇప్పటి వరకు 14 వేల పాములు పట్టిన ఘనత
తిరుపతి జిల్లా జూన్ 29
( నవ్యాంధ్ర న్యూస్ )
తిరుమలలో భక్తులకు పాముల బెడద లేకుండా చేసే టీటీడీ ఉద్యోగి భాస్కర నాయుడు.పామును పట్టే క్రమంలో మళ్లీ పాము కాటుకు గురయ్యారు. గోగర్భం డ్యాం సమీపంలోని గార్డెన్లో నాగుపామును పట్టుకుని బ్యాగులో వేస్తుండగా అతడి ఎడమచేతి పై కాటేసింది. రెండు నిమిషాలలోనే భాస్కర నాయుడు కుప్పకులాడు అక్కడి ఉద్యోగులు హుటాహుటిన తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించారు. విషం విరుగుడు మెడిసన్(యాంటీ వీనం) ఇచ్చినప్పటికీ పరిస్థితి విషమంగా మారడంతో తిరుపతిలోని అమర ఆస్పత్రికి వెంటిలేటర్ పై తరలించి వైద్యం అందిస్తున్నారు.
1982లో టీటీడీ అటవీశాఖలో కార్మికుడిగా చేరిన భాస్కర నాయుడి నైపుణ్యం గమనించి పాములు పట్టేందుకు ఆయనకు ప్రత్యేక విధులు కేటాయించారు. 2021లో రిటైరైనప్పటికీ కాంట్రాక్ట్ ఉద్యోగిగా మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు 14 వేలకు పైగా పాములు పట్టారు. 2022 జనవరిలో ఒకసారి తిరుపతిలో విషపూరితమైన పాము కాటేయడంలో నెలరోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకుని మళ్లీ విధులలో చేరారు.

