అన్నమయ్య జిల్లా డిసెంబర్ 24
(నవ్యంధ్ర న్యూస్ )
న్యాయవాదులు, విద్యార్థులతో జిల్లా కేంద్రంగా రాజంపేటను
ప్రకటించాలని న్యాయవాదుల సంఘ మాజీ అధ్యక్షులు కొండూరు శరత్ కుమార్ రాజు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ర్యాలీకి విశేష స్పందన
లభించినదిన్యాయస్థానం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తూ రోడ్ల భవనాల అతిది గృహం,పాతబస్ స్టాండ్ ల వద్ద నిర్వహిస్తున్న నిరాహార దీక్షలో పాల్గొన్న జిల్లా కేంద్ర సాధన సమితికి సంఘీభావం తెలిపి,పాత బస్ స్టాండ్ లో మానవహారం నిర్వహించి సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా న్యాయవాదుల సంఘ మాజీ అధ్యక్షులు కొండూరు శరత్ కుమార్ రాజు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి రాజంపేట కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, రెవిన్యూ పరంగా, రైల్వే పరంగా, రోడ్డు మార్గం గా ఒక గుర్తింపు ఉందని, భౌగోలికరం చూసినా రాజంపేట కేంద్ర బిందువుగా ఉన్నదని కావున రాజంపేట ను తప్పకుండా జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేశారు.రాజకీయ
కోణంలో కాకుండా ఇక్కడి ప్రాంత ప్రజల ఆకాంక్షను అర్తం చేసుకోవాలని, గతకొంత కాలంగా జేఎసి చేస్తున్న దీక్షలకు మద్దతు తెలుపుతూ సంఘీభావం తెలిపిన వారందరికీ హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జాఫర్ బాషా,రామచంద్ర రాజు, వల్లభరావు,సురేష్ బాబు,ఇందిర,కరణం శివ శంకర్ నాయుడు, ఛాయదేవి,మురళి, వెంకట సుబ్బయ్య, నాగేంద్ర,మౌలా,బాలాజీ నాయుడు,కెఎంఎల్ నరసింహ,గోవర్ధన్ రెడ్డి, ప్రభాకర్,తోఫిక్,శివ కుమార్,రాజశేఖర్, రవిశంకర్,అక్షయ్ కుమార్, వెంకట రమణ, చంద్రమౌళి, శ్రీకాంత్, షాహిద్,కోటేశ్వరరావు,మస్తాన్,శోభా రాణి, సాయి ప్రశాంతి,శబరి, సుభాషిణి,సరిత,మధు సూదన్,రమేష్, సుబ్రహ్మణ్యం,మణి, సూర్య ప్రకాష్,నాగేశ్వర్ చౌదరి,బిలాల్, గురు ప్రతాప్ రెడ్డి,స్థానిక,రైల్వే కోడూరు,నందలూరు న్యాయస్థాన న్యాయవాదులు, భారతీయ విద్యానికేతన్ విద్యార్థి,విద్యార్థులు,
తదితరులుపాల్గొన్నారు.

