జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని జిల్లా సాధన (జేఏసీ) కమిటీ సభ్యులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన కళాకారులు

Spread the love

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 18

( నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట పాత బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ కమిటీ దీక్షా శిబిరంలో స్థానిక.రైల్వే కోడూరు ప్రాంతాలకు చెందిన పలువురు కళాకారులు పాల్గొని ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రమణ్యం చిత్రపటాలకు పూలమాలవేసి ఘన నివాళులర్పించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కేంద్ర ఆవశ్యకత ఔన్నత్యాన్ని
కొనియాడుతూ జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని కోరుతూ పలువురు కళాకారులు పాటలను గానం చేశారు ఈ సందర్భంగా జనసేన పార్లమెంట్ ఇంచార్జ్ యల్లటూరుశ్రీనివాసరాజు కళాకారులను
అభినందిస్తూ
పూలమాలలతో
సత్కరించారు.
ఈ సందర్బంగా కళాకారులు
మాట్లాడుతూ
కళాకారులకు
ఈ అవకశం కల్పించిన జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
జేఏసీ రిలేదీక్షలలో కళాంజలి సాంస్కృతిక సంస్థ,ఆలాపన ఆర్కెస్ట్రా రిధం ఆర్కెస్ట్రా కళకారులు,గాయని గాయకులు
ఎస్.కళాంజలి,కృష్ణారెడ్డి పెంచలయ్య,శీను,శివ, ప్రసాద్,
ఆర్ వి సుబ్రహ్మణ్యం పోస్ట్ మాస్టర్ లక్ష్మీనారాయణ,
విశ్రాంతి పోస్ట్ మాస్టర్ సీతారామయ్య,
గాయని,గాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *