TDP నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తిని ఘనంగా సత్కారించిన అన్నమయ్య (రిజిస్టర్) ప్రెస్ క్లబ్ సభ్యులు
అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం ఇంచార్జ్ గా చమతి జగన్ మోహన్ రాజును గురువారం నిర్వహించిన మినీ మహానాడులో అబ్జర్వర్ దుర్గాప్రసాద్ ప్రకటించిన సందర్భంగా చమర్తి. జగన్ మోహన్ రాజును స్థానిక రోడ్ల బోనాల అతిథి గృహంలో శుక్రవారం అన్నమయ్య (రిజిస్టర్) ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వక కలిసి శాలువా, బొకే,పూలమాలతో ఘనంగా సత్కరించి శుభాభినందనలు తెలియజేశారు
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నిర్మాణాన్ని త్వరతిగతిన పూర్తి చేసి రాజంపేట కేంద్రముగా పనిచేస్తున్న ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల కార్యకలాపాలకు బాధితుల సమస్యల పరిష్కారానికి ఒక వేదికను అందుబాటులోకి తేవాలని అన్నమయ్య (రిజిస్టర్) ప్రెస్ కల్బ్ అధ్యక్ష, కార్యదర్శి,కార్యవర్గ సభ్యులు కోరగా స్పందించిన చమర్తి జగన్ మోహన్ రాజు ప్రెస్ క్లబ్ నిర్మాణ భవనం, పరిసరాలను పరిశీలించి త్వరతిగతిన ప్రెస్ క్లబ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులకు చర్చిస్తానన్నారు
ఈ కార్యక్రమంలో అన్నమయ్య ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రఘురామ రాజు, శివ, రవిచంద్ర ప్రసాద్ ,గుండ్రాతి విజయ్ కుమార్, సుబ్బ నరసింహులు, శ్రీధర్ ,అశోక్ రెడ్డి, శ్రీనివాసులు, జయరాజ్ ,రామ సుబ్బారెడ్డి, కళ్యాణ్, సురేష్ బాబు ,కార్తీక్, విజయ్ కుమార్, శివ నారాయణ, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.