పోలాను ఘనంగా సత్కారించి అభినందనలు తెలిపిన వాల్మీకులు
అన్నమయ్య జిల్లా అక్టోబర్ 07
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట పాత బస్ స్టాండ్ చిట్వేల్ రోడ్డులోని వాల్మీకి మహర్షి విగ్రహం వద్ద వాల్మీకి జయంతి వేడుకలను మంగళవారం రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ నల్లబోతుల ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాంనగర్ రమేష్ నేతృత్వంలో వాల్మీకి యువకులు పాల్గొని వాల్మీకి చిత్రపటంతో డప్పు వాయిద్యాల మధ్య చిత్రపటాన్ని వాల్మీకి విగ్రహం వరకు గ్రామోత్సవం నిర్వహించారు.
ఈ సందర్బంగా మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి
ఘననివాళులర్పించారు. బోయపాలెంలో వాల్మీకులు అల్పాహారం ఎర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.వాల్మీకులు ఇటీవల వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిలింగ్ సభ్యులుగా నీయుమితులైనందున పొలా శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పోలా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ధర్మాన్ని ఎలా రక్షించాలో వాల్మీకి మహర్షి తనరామాయణం ద్వారా ప్రజలకు
అందించారన్నారు.
శ్రీరాముడి వాల్మీకి రామాయణమే ప్రధాన ప్రమాణముగా సర్వత్ర అంగీకరింపపడుతుందనిసీతారాముల
సద్గుణాలను గొప్పతనాన్ని చెప్పడంతో పాటు సమాజ శ్రేయస్సుకు అవసరమైన ఎన్నో జీవన సూత్రాలు తెలియజేసిన వాల్మీకి మహర్షికి మనమందరం రుణపడిఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో నల్లబోతుల శంకరయ్య, మండ్ల శ్రీహరి,నాగ గణేష్, నాగరాజా, నరసింహ, వినోద్,రాంనగర్ రమేష్, సాయి, వంశీ, నాని, ధర్మన్న, ఆదినారాయణ, వెంకటేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

