ఘనంగా మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు

Spread the love

మేడా విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు

కడప జిల్లా జనవరి 23

(నవ్యంధ్ర న్యూస్ )

తెలుగుదేశం యువనేత, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నందలూరు మండలపరిధిలోని చెన్నయ్యగారిపల్లిలోని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి స్వగృహంలో శుక్రవారం అత్యంత కోలాహలంగా
నిర్వహించారు.
పార్టీ శ్రేయోభిలాషులు,
నాయకులు,కార్యకర్తలు పాల్గొని నారా లోకేష్ చిత్రపటం వద్ద కేక్ కట్ చేసి,నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్బంగా మేడా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ
నారా లోకేష్ రాష్ట్ర భవిష్యత్తు,యువతకు ఉపాధి కల్పించ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని.ఐటి విజన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం పురోగతి సాధించాలని,నారా లోకేష్ అ భగవంతుడు
ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.భవిషత్ లో రాష్ట్ర ప్రజల కోసం నారా లోకేష్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఒక నవశకానికి నాంది పలికిన నాయకుడు, యువత ఆశాజ్యోతి, మన మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు నిర్వహించుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. లోకేష్ కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు,లక్షలాది మంది యువతకు స్ఫూర్తి ప్రదాత అన్నారు.
అభివృద్ధికి చిరునామా లోకేష్ అని గతంలో ఐటీ,పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా లోకేష్ చేసిన అభివృద్ధి పనులు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాయని.గ్రామ గ్రామానికి ఎల్ఈడి వెలుగులు తెచ్చినా, మారుమూల ప్రాంతాలలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినా లోకేష్ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.
నేడు మళ్ళీ రాష్ట్రం క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారు.
​కార్యకర్తల పక్షపాతి
లోకేష్ కు కార్యకర్తలు అంటే ప్రాణమని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతి కార్యకర్తను పేరుపేరునా పలకరించి, ధైర్యం చెప్పి, ‘నేనున్నాను’ అని భరోసా ఇచ్చిన గొప్ప మనసున్న నాయకుడు లోకేష్ అని యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజల కష్టాలను స్వయంగా చూసి,వారి కన్నీళ్లు తుడిచేందుకు లోకేష్ పడ్డ తపన అసాధారణ
మన్నారు.భవిష్యత్ లో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో లోకేష్ చూపిస్తున్న చొరవ అద్భుతమని,లోకేష్ కు భగవంతుడు సంపూర్ణ
ఆయురారోగ్యాలను ప్రసాదించి,రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవ చేసే స్థాయికి ఎదగేలా
అభగవంతుడు ఆశీస్సులుప్రసాదించాలని మనసారా కోరుకుంటునన్నన్నారు.
మాజీ ఎంపీపీ భువన బోయిన లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ
“నారా లోకేష్ యువతలో స్ఫూర్తిని నింపుతున్నారని. సామాన్య కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీని బలోపేతం చేయడంలో ఆయన పాత్ర అమోఘమన్నారు. లోకేష్ పుట్టినరోజు సందర్బంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉంధన్నారు.
​లేబక సర్పంచ్ లంకయ్య నరసయ్య మాట్లాడుతూ
“మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అభివృద్ధి పనులలో లోకేష్ తనదైన ముద్ర వేస్తుకున్నారని.గ్రామ స్థాయిలో సమస్యల పరిష్కారానికి లోకేష్ చూపిస్తున్న చొరవ అభినందనీయమన్నారు.లోకేష్ మరిన్ని పుట్టినరోజులు కార్యకర్తల నడుమ నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపీపీ భువన బోయిన లక్ష్మీ నరసయ్య,లేబక సర్పంచ్ లంకయ్య గారి నరసయ్యతో పాటు ఎంపీటీసీ భువన బోయిన పెంచలయ్య, చుక్క వెంకటేష్, తెలుగుదేశం పార్టీ శ్రేణులు,నాయకులు, కార్యకర్తలు,
అభిమానులు తదితరులు పాల్గొని లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంపిణీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *