కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లా రాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ )
మండలపరిధిలోని తాళ్లపాకలో వెలసియున్న శ్రీ తాళ్లపాక అన్నమాచార్య విగ్రహానికి 617 వ జయంతిని పురస్కరించుకుని బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు
ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇంచార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు,బిజెపి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ లు మాట్లాడుతూ తొలి తెలుగు వాగ్దేయకారుడు సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ 32వేల సంకీర్తనలు రచించి ఆలపించిన గొప్ప వాగ్గేయ కారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు రాజంపేటలో జన్మించడం మనందరి మహాత్భాగ్యమన్నారు గత ఐదు సంవత్సరాలలో తాళ్లపాక అన్నమాచార్యుల ప్రాజెక్టు టిటిడి పూర్తిగా నిర్లక్ష్యంగా వహించి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు ఈ కూటమి ప్రవృత్తంలో ఒక మంచి రోడ్డు మ్యాప్ తో తాళ్లపాక అభివృద్ధి చెందాలని అధికారుల దృష్టికి స్థానిక సమస్యలన్నిటిని త్వరలో తీసుకుపోతామన్నారు
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు వై సురేష్ రాజు బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపగల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు

