అన్నమయ్య జిల్లా డిసెంబర్ 27
(నవ్యంధ్ర న్యూస్ )
తెలుగుదేశం సిక్స్ లైన్ క్లస్టర్ ఇంచార్జ్ లింగాల శీను పుట్టినరోజు వేడుకలను యన్ టి ఆర్ కూడలిలో శనివారం లింగాల శ్రీను స్నేహితుడు జాబీర్ ఆధ్వర్యంలో ఘనంగానిర్వహించారు.
ఈ సందర్బంగా కేక్ కట్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జాబీర్ మాట్లాడుతూ రాజంపేట మన్నూరుకు చెందిన లింగాల శ్రీను తండ్రి కువైట్ రమణ పట్టణ, పరిసర ప్రాంత వాసులకు సూపరచితులని కువైట్ రమణ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేసినవారెనన్నారు. తండ్రి బాటలో లింగాల శ్రీను పయనిస్తూ తెలుగుదేశం పార్టీలో కార్యకర్త నుండి సిక్స్ లైన్ క్లస్టర్ ఇంచార్జ్ గా లింగాల శ్రీను ఎంపికై,పార్టీ అభివృద్ధిపథంలో నడిపించేందుకు ప్రతి కార్యకర్తకుఅందుబాటులో ఉండి సహాయ సహకారాలందిస్తుండడం
అభినందనీయమన్నారు. రానున్న రోజులలో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని లింగాల శ్రీను శ్రేయోభిలాషులు, మిత్రులు,ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అనుముల గుండం మనోహర్,వినయ్ రెడ్డి, మని,నాని,చక్రి, జయ,నాగరాజ తదితరులు పాల్గొన్నారు.

