కడప జిల్లా ఏప్రిల్ 09
(నవ్యంధ్ర న్యూస్ )
మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు హెచ్చరించారు.
రాజంపేట పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్ లో మధ్యాహణ భోజన పథకాన్ని గురువారం ఆకస్మిక తనిఖి చేశారు.
మధ్యాహ్న భోజన పథకా రికార్డులను చమర్తి జగన్ మోహన్ రాజు పరిశీలించారు.
ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం తీరును క్షేత్రస్థాయిలో జగన్ మోహన్ రాజు పరిశీలించారు.
పాఠశాల హెచ్ఎం సిబ్బందితో కలిసి వంటగది,పాఠశాల పరిసరాల పరిశుభ్రత చమర్తి తనిఖీ చేశారు.
విద్యార్థినిలతో కలిసి బోంచేసారు.
విద్యార్థినులను భోజనం బాగుంటుందా ? కడుపునిండా మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? అని చమర్తి అడిగి తెలుసుకున్నారు.
మధ్యాహ్న భోజన పథకం పై వంట నిర్వాహకులకు పలు సూచనలు సలహాలు చేశారు.పాఠశాలలో విద్యార్థులకురుచికరమైన,శుచికరమైన ఆహారం అందించడంలో ఎలాంటి అలసత్వం వహించొద్దని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. మొబైల్ ఫోన్స్,టీవీలకు దూరంగా ఉండాలని చమర్తి జగన్ మోహన్ రాజు విద్యార్థులకు హితబోధ చేశారు.
ఈ కార్యక్రమంలో చమర్తి వెంట ఉపాధ్యాయులు,
సిబ్బంది,పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

