అన్నమయ్య జిల్లా డిసెంబర్ 09
(నవ్యంధ్ర న్యూస్ )
కడప-తిరుపతి మార్గంలో రాబోవు సంక్రాంతి నుంచి ప్రయాణికులు సుఖంగా గమ్యస్థానం చేరుకునేందుకు పనులు జరుగుతున్నాయి.
ఈ మేరకు రహదారిని పునర్నిర్మాణం పనులు వేగవంతంగా పొద్దు పోయే వరకు పనులు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా
ఈ జాతీయ రహదారులో వర్షాల కారణంగా గోతులు ఏర్పడి వాహనాలకు ఇబ్బంది కరంగా మారింది. ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు మరింతగా రోడ్డు పాడైపోయింది.
కడప నుంచి తిరుపతికి బస్సులోమూడుగంటలు, కారులో 2.30 గంటలు పడుతుంది. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్న కారణంగా 1.30 నుంచి 2.30 గంటల సమయం అదనపు సమయం పడుతోంది.
వాహనాలు త్వరగా పాడైపోయి షెడ్లకు చేరుతున్నాయి.
ప్రస్తుతం రోడ్డు పునర్నిర్మాణ పనులు పూర్తయితే సుఖ
ప్రయాణంతో పాటు వాహనాలు మన్నికగా ఎక్కువ కాలం పనిచేస్తాయి.

