కడప జిల్లా ఫిబ్రవరి 10
(నవ్యంధ్ర న్యూస్ )
ప్రొద్దుటూరులో సమావేశం ముగించుకొని కడపకు వస్తుండగా మార్గ మధ్యలో చాపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోమంగళవారం రాత్రి కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వాహనం వెనుక వస్తున్న లారీ కలెక్టర్ వాహనాన్ని ఢీకొంది. కలెక్టర్ వాహనం ముందు వెళ్తున్న వాహనాలు ఒక్కసరిగా వేగం తగ్గించడంతో కలెక్టర్ వాహన డ్రైవర్ వేగం తగ్గించనందున వెనక వస్తున్న లారీ కలెక్టర్ వాహనాన్ని ఢీకొంది.
ఈ ఘటనలో కలెక్టర్ సురక్షతం,కలెక్టర్ వాహనం పాక్షికంగా దెబ్బతింది.

