కడప జిల్లా సెప్టెంబర్ 02
( నవ్యాంధ్ర న్యూస్ )
ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్, ఐటీ ఉత్పత్తుల తయారీ సంస్థ టెక్నోడోమ్.కమలాపురం నియోజకవర్గంలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ లో ఏర్పాటుచేసిన ఎల్ఈడీ టీవీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్,దేశంలోనే తొలిసారిగా జిల్లాపరిధిలోని కమలాపురం నియోజకవర్గం సికె దిన్నె ఎంపిపి పాఠశాల ఆవరణలో రూ.2కోట్లతో ఏర్పాటుచేసిన సెంట్రలైజ్డ్ అడ్వాన్స్ డ్ స్మార్ట్ కిచెన్, పెండ్లిమర్రిలో రూ.12కోట్ల రూసా నిధులతో నిర్మించిన ఆధునాతన ఆదర్శ డిగ్రీ కళాశాల భవనాలను ప్రారంభోత్సవానికి కడప జిల్లాకు విచ్చేసిన ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ను తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి విమానాశ్రయంలో మర్యాదపూర్వంగా కలిసి రాజంపేటనియోజకవర్గ సమస్యలు,అభివృద్ధి అంశాలను నారా లోకేష్ కు తెలియజేశారు.
అనంతరం కడప జిల్లా అభివృద్ధికై సహకరిస్తున్న మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు

