ఎర్రచందనం అక్రమ రవాణాకి పాల్పడుతున్న వ్యక్తుల పై పోలీసుల ఆకస్మిక దాడులు

Spread the love

05 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

1.061 టన్నుల 36 దుంగలు,

1 మోటార్ సైకిల్ స్వాధీనం,

ఎర్రచందనం అక్రమ నరికివేత, రవాణా పై కఠిన చర్యలు

కడప జిల్లా ఫిబ్రవరి 07

(నవ్యంధ్ర న్యూస్ )

జిల్లాలో ఎర్రచందనం అక్రమ నరికివేత రవాణానుఅరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్న క్రమంలో, మన్నూరు రూరల్
యు /జి,నందలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 05 మంది ఎర్రచందనం స్మగ్లర్‌లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి సుమారు 1,061 టన్నుల 36ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్,ఎఎస్పి మనోజ్ రామ్ నాధ్ హెగ్డే, రూరల్ సిఐ,సిబ్బందితో రాజంపేట మన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశం జిల్లా ఎస్పీ వివరాలు వెల్లడించారు.
ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ..ఎర్ర చందనం స్మగ్లింగ్
కు పాల్పడుతున్న
5 మందిని అరెస్టు చేశామన్నారు.
ఎస్పి ఆదేశాల మేరకు,
సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఎఎస్పి మనోజ్ రామనాథ్ హెగ్డే, సూచనల మేరకు, మన్నూరు యు /జి పోలీస్ స్టేషన్,ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్,ప్రసాద్ బాబు, సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వెంకటేశ్వర్లు,
ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, వై.ఎస్.ఆర్
జిల్లా ఎర్రచందన ఇన్స్పెక్టర్ సి. చంద్రశేఖర్ రెడ్డి బృందంతో కలిసి శుక్రవారం.
మండలపరిధిలోని రేణింతలఅరుందతీవాడ గ్రామ సమీపంలోని అడవి ప్రాంతంలో గాలింపులు చేపట్టారు. పోలీసులను గమనించిన ముగ్గురు వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించగా, వారిలో ఒకరిని పట్టుకున్నారు. విచారణలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు నేరాన్ని ఒప్పుకున్నాడు. విచారణలో వెల్లడించిన వివరాల ఆధారంగా అక్కడే దాచి ఉంచిన 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ గాలింపులలో పట్టుపడ్డ ఓ ముద్దాయి గతంలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులలో నిందితుడిగా ఉన్నట్లు నిర్ధారణ అయినదని
ఇతని పై 12 కేసులు ఉన్నాయని గతంలో ఇతని పై పిడి యాక్ట్ నమోదుచేశారన్నారు.
ఎర్రచందనం నరికినా, దాచినా,కొనుగోలు చేసినా,రవాణా చేసినా సహకరించిన సంబంధిత వారి పై కఠినమైన, నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి చట్టప్రకారం కఠిన చర్యలుతీసుకుంటామని హెచ్చరించారు. పునరావృత నేరస్తులపై పిడి యాక్ట్ అమలు చేస్తామన్నారు.ప్రజలకు ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన పోలీసులకు
తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *