అన్నమయ్య జిల్లా ఆగస్టు 13
( నవ్యాంధ్ర న్యూస్ )
రాజంపేట మండల పరిషత్ అధ్యక్షురాలుగా కూచివారిపల్లి – 2 ఎంపీటీసీ ఆరెళ్ళ రమణమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఎం.నరసింహమూర్తి ప్రకటించారు.మండల పరిషత్ కార్యాలయ సభాభవనంలో బుధవారం ఈ ఎన్నికను నిర్వహించారు. రమణమ్మను ఆర్. బుడుగుంట పల్లె ఎంపిటిసి ఆకేపాటి రంగారెడ్డి,తాళ్లపాక ఎంపిటిసి డి. మధు సూధన వర్మ ప్రతిపాదించారు.
ఈ సమావేశానికి 14 మంది ఎంపీటీసీలు హాజరయ్యారు. ఎంపీడీవో వరప్రసాద్ పాల్గొన్నారు.

