తిరుపతి జిల్లా మార్చి 31
(నవ్యంధ్ర న్యూస్ )
చిట్వేల్ మండలపరిధిలోని తుమ్మకొండ వడ్డిపల్లిలోని సర్వే నెంబర్ 26 లోని ఊరకుంటను సంబంధిత రెవిన్యూ,విద్యుత్ అధికారుల సహకారంతో గ్రామస్తులు ఆక్రమించుకుని వేరే సర్వే నెంబర్లలలో మంజూరైన ట్రాన్స్ఫార్మర్లు,బోర్లను ఊరకుంటలో ఎర్పాటు చేసి ఊరకుంటను ఆక్రమించారని అక్రమణకు గురైన ఊరకుంటను సంరక్షించాలని ఆవులకుంట గంగయ్య ఫిబ్రవరి ఒకటో తేదీ చిట్వేల్ మండల తాసిల్దార్ కు ఫిర్యాదు చేశారు.
సంబంధిత రెవెన్యూ ఉన్నతాదికారులు ఆక్రమణకు గురైన ఊరకుంట సంరక్షణ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థుడు ఆవులకుంట గంగయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెవిన్యూ అధికారుల అండదండలతోనే గ్రామస్థులు ఊరకుంటను ఆక్రమించారని ఆవుల కుంట గంగయ్య వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని అక్రమణకు గురైన ఊరకుంటను సంరక్షించాలని ఆవులకుంట గంగయ్య కోరుతున్నారు.

