ఆశాబోస్లే లేని లోటుతీరనిది ఎస్ కళాంజలి.

Spread the love

జాతీయ గాయనిగా గుర్తింపు పొందిన ఆశాభోస్లే

కడప జిల్లా ఏప్రిల్ 12

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట భారతదేశ గాయని,గాయకులలో హిందుస్తానీ సంగీతంలో సినిమా ప్రపంచంలో మరో కలిగితురాయి శ్రీమతి ఆశాభోస్లే అంతటి గాయని లేని లోటు ఎన్నటికీ తీరనిదని,ఆమె మృతి పట్ల రాజంపేట కళాంజలి సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు
ఎస్.కళాంజలి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలు అలనాటి కాలంలో అతి తక్కువ పాటలు పాడినటువంటి గాయనిమణి గా గుర్తింపు పొందిన ఆశాబోస్లే అనేక హిందీ పాటలు ఆలపించి చరిత్ర సృష్టించారన్నారు. ఆశాభోస్లే లేని లోటు
చిత్ర పరిశ్రమతో పాటు వర్ధమాన గాయని గాయకులకు ప్రోత్సాహకం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు పరిశ్రమలో
ఎస్పీ బాలసుబ్రమణ్యం ఘంటసాల వంటి గాయని గాయకుల శ్రేణిలో ముగుతాయమానంగా విరాజిల్లుందన్నారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆశాభోస్లే తెలుగు సినిమాలలో మొత్తం 8 పాటలు ఆలపించారు.,అ పాటలు ఎప్పటికీ మర్చిపోలేని క్లాసిక్స్‌గా నిలిచాయన్నారు.
ఈ పాటలు 1981లో ‘పాలు నీళ్లు’ సినిమాతో మొదలై, 2007లో ‘చందమామ’ వరకు విస్తరించాయి
పాలు నీళ్లు చిత్రంలో ఇది మౌనగీతం, చిన్ని కృష్ణుడు చిత్రంలో జీవితం సప్త సాగరం అశ్వమేధం అనే సినిమాలో రెండు పాటలు పాడారు ఓ ప్రేమ అనే పాట తో పాటు శీతాకాలం ప్రేమకు అనేది రెండో పాట ప్రేమకు ప్రేమంటే తెలుసా చిత్రంలో ఝల్లండి మరి పవిత్ర బంధం సినిమాలో ఐసాలకిడి ఇద్దరూ అనే సినిమాలో వెన్నెల అనే పాటను పాడగా చివరి చిత్రంగా 2007 చందమామ అనే సినిమాలో నాలో ఊహలకు అనే పాటను గానం చేశారు. ఆమె
తుది శ్వాస కోల్పోవడం భారతదేశ గాయనిమణులలో ఒక మేరు శిఖరం నెల వాలిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *