ఆర్ యు బి పనులను పరిశీలించిన వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు ఆకేపాటి.

Spread the love

అకేపాటి వెంట
డిఆర్ యుసిసి సభ్యులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి

కడప జిల్లా ఏప్రిల్ 11

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేటలోని 103
ఆర్ యు బి పనులను శనివారం వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,శాసన సభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి,
డిఆర్ యు సి సి సభ్యులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి లు సంయుక్తంగా పనులను పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేసి పాదచారులకు అందుబాటులోకి తేవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో శాసన సభ్యులు,
డిఆర్ యుసిసి సభ్యులు డిఆర్ఎం ను కలిసి
ఆర్ యు బి ని పూర్తి చేయాలని విన్నవించగా తద్వారా పాదచారులు నడిచి వెళ్లేందుకు మార్గం సుగమవుతుందని తెలిపి పనులను ప్రారంభించారని ఆర్ యు బి పనులను పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలా రెడ్డి,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చొప్ప ఎల్లారెడ్డి, ఏడిఎన్ వాసుదేవ నాయుడు,డీసీఎంఎస్ మాజీ చైర్మన్ దండు గోపి, డీలర్ సుబ్బారెడ్డి, ప్రభాకర్ రాజు, సుబ్రహ్మణ్యం, శ్రీను, సుబ్బరాయుడు, రమేష్, విశ్వనాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *