ఆకేపాడును నాలుగు పంచాయితీలుగా చేయాలనుకున్న ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసిన ఆకేపాటి మురళి రెడ్డి
కడప జిల్లా జనవరి 09
(నవ్యంధ్ర న్యూస్ )
కడప జిల్లాలో ఆకేపాటి గోపాల్ రెడ్డి అంటే తెలియని వారు ఉండరు.అందరికి సూపరిచితులైన అకేపాటి గోపాల్ రెడ్డి మరణించి 25 ఏళ్లు గడుస్తున్న రాజంపేట మండలపరిధిలోని ఆకేపాడులోని ఏడు పంచాయతీలు ఇప్పటికీ వారికి పెట్టని కోటలు.అందులో ఆకేపాడు పాడు గ్రామపంచాయతీ వారి స్వగ్రామం.ఈ గ్రామాన్ని నాలుగుపంచాయతీలుగా చేయాలని ఇటీవల ప్రత్యర్ధులు పన్నాగం పన్నారు. వారి వినతి మేరకు జిల్లా పంచాయతీ అధికారులు గ్రామంలో ప్రజలతోప్రజాభిప్రాయాన్ని సేకరించారు.ఎవరైతే నాలుగు పంచాయతీలు కావాలని విన్నవించారో ఒక్కరు కూడా అటువైపు రాలేదు.నియోజకవర్గ
నాయకుడైన ఆకేపాటి శ్రీనివాసుల రెడ్డి (మురళి రెడ్డి) వచ్చారు. అంతే అంతా ఆయనకు బాసటగా నిలిచారు.
మా పంచాయితీ ఒకే గ్రామంలో ఉండాలని మహిళలతో సహా ముక్తకంఠంతో ఏకగ్రీవంగా బలపరచడంతో ఆకేపాటి మురళి రెడ్డి నాయకత్వం ఏమిటో ప్రత్యర్థులకు అర్థమైంది.
అకేపాడులో నేటికీ మురళి రెడ్డి దే హవా.
మురళి రెడ్డి చెప్పిందే.. వేదం,శిలాశాసనం.
అకేపాడులో అభివృద్ధి,సంక్షేమ పథకాల భాగంగా, పేదలకు గృహాలు అన్ని సమపాళ్లలలో
న్యాయబద్ధంగా అందరికీ పంచి పెడతారు.
పేద ప్రజలతో మమేకమై ఎస్సీ,ఎస్టీ,
మైనార్టీలందరితో కలిసి ఆత్మీయతఅనురాగాలతో వారిలోఒకరిగాఉంటారు.అందుకే ఆకేపాటి మురళి రెడ్డి ఆ గ్రామంలో ఏక్ నిరంజన్ గా పిలువబడుతున్నారు.
7 పంచాయితీలు వారికి పెట్టని కోటగా నిలుస్తున్న ఆకేపాడుగడ్డ
ఆకేపాటి అడ్డా అని చెప్పడం అతిశయోక్తి కాదు.

