అమరావతి మార్చి 12
(నవ్యంధ్ర న్యూస్ )
సచివాలయంలో నిర్వహించిన ఆరుజిల్లాల కలెక్టర్ ల సదస్సులో భాగంగా, రెండో రోజు గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్ లకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ముఖ్యమంత్రిని కలిసి జిల్లాలో జరుగుతున్న ప్రగతి, వివిధ అభివృద్ధి కార్యక్రమాల పై చర్చించారు. జిల్లాలో అమలు అవుతున్న ప్రభుత్వ పథకాలు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిని ముఖ్యమంత్రికి వివరించారు.

