అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల లెక్చరర్ చోరగుడి శశిధర్ శర్మ మృతి

Spread the love

కడప జిల్లా జనవరి 31

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట మండల పరిధిలోని బోయినపల్లిలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ లెక్చర్ గా పనిచేస్తున్న చోరగుడి శశిధర్ శర్మ (46) శుక్రవారం రాత్రి చెన్నైలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో మృతి చెందారు.శశిధర్ శర్మ గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తులసమస్యతో బాధపడుతుంనందున్న కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం చేయించినప్పటికి ఫలితం లేక పోయింది. ఇదిలా ఉంటే శశిధర్ శర్మ దసరా ఉత్సవాలలో అమ్మవారిశాలలో అర్చకులుగా అమ్మవారికి పూజలు నిర్వహించేవారు.
దసరా ఉత్సవాలు,
వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవాలలో శశిధర్ శర్మ నే వాసవిమాత ఉత్సవ విగ్రహాన్ని గుండ ప్రవేశం చేయించేవారు. శశిధర్ శర్మ మృతితో సహచర అధ్యాపకులు, సిబ్బంది, వాసవీ మాత భక్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏది ఏమైనాపిన్నవయస్సులోశశిధర్ శర్మ మృతి చెందడం బాధాకరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *