మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమరియా (ఓఎఫ్‌కే) తమ అధికారులు, ఉద్యోగులకు రెండు రోజులకు మించి సెలవులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఉత్పత్తి టార్గెట్ల దృష్ట్యా లాంగ్ లీవ్స్ రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. భారత సాయుధ బలగాలకు ఆయుధ సామగ్రిని సరఫరా చేసే అతిపెద్ద యూనిట్లలో ఇది ఒకటి.
న్యూఢిల్లీ: హహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత్‌లో రక్షణ సంబంధిత వస్తువులను ఉత్పత్తి చేసే కంపెనీలు (Ordance manufacturing companies) అప్రమత్తమయ్యాయి. నిరంతరాయ ఉత్పత్తి, సన్నద్ధతకు తగిన చర్యలు చేపడుతున్నాయి. తమ ఉద్యోగుల దీర్ఘ కాల సెలవులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
లాంగ్ లీవ్స్ రద్దు
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమరియా (ఓఎఫ్‌కే) తమ అధికారులు, ఉద్యోగులకు రెండు రోజులకు మించి సెలవులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఉత్పత్తి టార్గెట్ల దృష్ట్యా లాంగ్ లీవ్స్ రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. భారత సాయుధ బలగాలకు ఆయుధ సామగ్రిని సరఫరా చేసే అతిపెద్ద యూనిట్లలో ఇది ఒకటి. ఇందులో 4,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉత్పత్తి లక్ష్యాల దృష్ట్యా తాము తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చినట్టు ఓఎఫ్‌కే పీఆర్ఓ అవినాష్ శంకర్ ధ్రువీకరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో, ఏప్రిల్‌లో తాము ఇంకా టార్గెట్ రీచ్ కాలేదని, ఇందుకు అవసరమైన సిబ్బంది, పర్యవేక్షణల దృష్ట్యా సెలవులను రద్దు చేయాలని హెడ్‌క్వార్టర్స్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు చెప్పారు.
మహారాష్ట్రలోనూ..
జబల్పూర్ తరువాత మహారాష్ట్రలోని చంద్రపూర్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కూడా ఇదే తరహా ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల లీవులు తక్షణం రద్దు చేశామని, సాధ్యమైనంత త్వరగా ఉగ్యోగులు విధుల్లోకి చేరాలని చీఫ్ జనరల్ మేనేజర్ ఒక ఉత్తర్వులో పేర్కొన్నారు. మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అదేశాల మేరకు సెలవులు రద్దు చేశామని, తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపారు. జాతీయ భద్రత, ఆపరేషనల్ అర్జెన్సీ దృష్ట్యా ఈ ఆదేశాలు జారీ చేశామని, వీటిని తూ.చ. తప్పకుండా పాటించాల్సి ఉంటుందని, లేని పక్షంలో దీనిని తీవ్రంగా పరిగణించడం జరుగుతుందని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.