సీట్ల కేటాయింపులో దివ్యాంగులకు తొలి ప్రాధాన్యత.
రాష్ట్ర టిడిపి మహిళా నాయకులు ముక్కా వరలక్ష్మి రెడ్డి,
రాష్ట్ర టిడిపి యువ నాయకులు ముక్కా సాయి వికాస్ రెడ్డి
బస్సును ప్రారంభించిన, ముక్కా వరలక్ష్మి రెడ్డి, ముక్కా సాయి వికాస్ రెడ్డి
తిరుపతి జిల్లా మార్చి 18
(సవ్యాంధ్ర న్యూస్ )
ప్రతినిధి
(పాణ్యం లోకేష్ బాబు)
కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఉగాది కానుకగా ‘దివ్యాంగ శక్తి’ పథకం అమలుకు శ్రీకారం చుట్టిందని ముక్కా వరలక్ష్మి రెడ్డి,ముక్కా సాయి వికాస్ రెడ్డిలు అన్నారు.
రైల్వేకోడూరులోని ఏపీఎస్ ఆర్టీసీ రాజంపేట డిపో బస్సును రైల్వేకోడూరు పట్టణ ఎం.పీ.డీ.ఓ , కార్యాలయం వద్ద
దివ్యాంగ శక్తి’ పథకాన్ని రాష్ట్ర టి.డి.పి,మహిళా నాయకులు ముక్కా వరలక్ష్మిరెడ్డి,రాష్ట్ర తెలుగుదేశం
యువనాయకులు ముక్కా సాయి వికాస్ రెడ్డిలు బుధవారం ఘనంగా ప్రారంభించి
రైల్వేకోడూరు నుంచి అనంతరాజుపేట ఆర్టికల్చర్ యూనివర్సిటీ మీదుగా మంగంపేట కోర్లకుంట గొల్లపల్లి,అమృతవారిపల్లి ముక్కావారిపల్లి వరకు దివ్యాంగులతో కలసి బస్సు ప్రయాణం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా టిడిపి నాయకులు ముక్కా వరలక్ష్మీ రెడ్డి మాట్లాడుతూ గత ఏడాది డిసెంబరు 3వ తేదీ నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాగ్దానం చేసారని ఆ వాగ్దానాన్ని
ఉగాది పండుగను పురస్కరించుకొని అమలుచేసారన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో
లక్ష మందికి లబ్ది కలుగుతుండగా, సీట్ల కేటాయింపులో దివ్యాంగులకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ప్రస్తుతం 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు,100 శాతం కంటి చూపు కోల్పోయిన వాళ్లు,100 శాతం మూగ, చెవిటివారు,40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న మానసిక దివ్యాంగులు మాత్రమే ఏపీఎస్ఆర్టీసీ సిటీ, ఆర్డినరీ బస్సులలో ఉచితంగా
ప్రయాణిస్తున్నారు.
పల్లెవెలుగు,అల్ట్రా పల్లె వెలుగు,ఎక్స్ప్రెస్ బస్సులలో ప్రస్తుతం వీరికి 50 శాతం రాయితీ లభిస్తోంది.100 శాతం అంధత్వం,మానసిక వైకల్యం ఉన్న వారితో వచ్చే సహాయకులకు 50 శాతం రాయితీ లభిస్తోంది.
40 శాతం వైకల్యం దాటిన వారికి వర్తింస్తుందని దివ్యాంగ శక్తి’ పథకం దివ్యాంగులకు పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కూటమి ప్రభుత్వం
ప్రకటించిందన్నారు.40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు అందరికీ స్త్రీశక్తి పథకం వర్తించే అన్ని బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తుందని,వారితోపాటు వచ్చే సహాయకులకు
ఈ బస్సులలో 50 శాతం రాయితీ లభిస్తుందని
ఇకపై 21 వర్గాలకు పథకం వర్తింపు ఇప్పటి వరకు కేవలం 4 వర్గాల దివ్యాంగులకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండేదని,ఇకపై 21 వర్గాల దివ్యాంగులకు ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని కల్పించనుందన్నారు. శారీరక,మానసిక దివ్యాంగులు,ఆటిజం,నాడీ సంబంధ వ్యాధులు, తలసేమియా, హీమోఫిలియా,సికిల్ సెల్ వంటి వ్యాధిగ్రస్తులకు
ఈ పథకంతో భరోసా కలుగుతుందని
దివ్యాంగులకు క్యూఆర్ కోడ్ తో ఉచిత డిజిటల్ పాసులు జారీ చేసి స్త్రీ శక్తి పథకం వర్తించే బస్సులలో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు.
అవసరమైన డిజిటల్ పాసులు మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యాప్, ఏపీఎస్ ఆర్టీసీ యాప్ ద్వారా పొందవచ్చని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్ లలోని 134 కౌంటర్లలలో దివ్యాంగులకు సేవలందుతాయన్నారు.. ఈ యాప్స్ ను సదరం యాప్ తో అనుసంధానించి
నందున ఫిజికల్ సర్టిఫికెట్స్ చూపించాల్సిన అవసరం లేదని,క్యూఆర్ కోడ్ లో ఉచిత డిజిటల్ పాసులు జారీ చేస్తారన్నారు.
ఈ పథకం అమలుకు ప్రభుత్వం ఏటా రూ.207 కోట్లు సబ్సిడీగా అందిస్తుందన్నారు.
దివ్యంగులకు అండగా సీఎం చంద్రబాబు
మేథాశక్తిలో, సృజనాత్మకతో దివ్యంగులు అత్యంత ప్రతిభ కలిగి వుంటారన్నారు.. దివ్యంగులకు సీఎం చంద్రబాబు ఎప్పుడూ అండగానిలిచి,దివ్యంగుల పింఛన్ రూ.6వేలకు పెంచారన్నారు.
ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీకీ కట్టుబడి ‘దివ్యంగశక్తి’ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
దివ్యంగుల అభిరుద్దికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్య,ఐటి మంత్రి నారా లోకేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ముక్కవారిపల్లిలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో భోజనాలు ఎర్పాటు చేసి స్వయంగా యువ నాయకులు ముక్క సాయి వికాస్ రెడ్డి వడ్డించారు.
ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ,కూటమి నేతలు,తదితరులు పాల్గొన్నారు.

