నవశకానికి నాంది – దివ్యాంగ శక్తి పథకం

Spread the love

కడప జిల్లా మార్చి 27

,(నవ్యంధ్ర న్యూస్ )

2025 డిసెంబర్‌లో వాగ్దానం చేసిన హామీని అతి తక్కువ కాలంలోనే అమలులోకి తెచ్చి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన విశ్వసనీయతను మరోసారి చాటుకున్నారని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్బంగా మేడా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల సాధికారత: ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా దివ్యాంగుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, వారు సమాజంలో ఆత్మగౌరవంతో స్వేచ్ఛగా తిరిగేలా ఈ పథకం దోహదపడుతుందని
కేవలం మాటలకే పరిమితం కాకుండా, క్యాబినెట్ ఆమోదం పొందిన వెంటనే నిధులు విడుదల చేసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని
కేవలం పల్లె వెలుగు మాత్రమే కాకుండా ఎక్స్‌ప్రెస్,మెట్రో ఎక్స్‌ప్రెస్ వివిధ రకాల బస్సులలో
ఈ సౌకర్యం కల్పించడం ద్వారా అన్ని వర్గాల దివ్యాంగులకు మేలు జరుగుతుందన్నారు.
మానవీయ కోణం దివ్యాంగులను కేవలం ఓటర్లుగా కాకుండా, సమాజంలో సమాన భాగస్వాములుగా గుర్తించి ‘దివ్యాంగ శక్తి’ అనే గౌరవప్రదమైన పేరుతో
ఈ పథకాన్ని తీసుకురావడం ముఖ్యమంత్రి మానవీయతకు అద్దం పడుతోందని
​ఇది మంచి ప్రభుత్వమని ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తూ, ‘ప్రజాసేవయేపరమావధి’గా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని
అంగవైకల్యం శరీరానికే కానీ ఆత్మవిశ్వాసానికి కాదని నమ్మి, వారిఆత్మవిశ్వాసాన్ని పెంచేలా అడుగులు వేస్తున్న చంద్రబాబు నాయుడు కు ధన్యవాదాలు
తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *