కడప జిల్లా మార్చి 13
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట పట్టణంలో పాత బస్టాండ్ కూడలిలో విజ్ మనీ సంస్థ నూతనశాఖను శుక్రవారం జోనల్ హెడ్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో మొత్తం 338 బ్రాంచులలో ఈ శాఖ నూతన శాఖ ప్రారంభించామన్నారు.
పరిసర ప్రాంత ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాల ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ఈ శాఖ ప్రారంభం ముఖ్య ఉద్దేశమన్నారు.
విజ్ మని సంస్థ ద్వారా విదేశీ కరెన్సీ మార్పిడి, విదేశాలకు డబ్బు పంపే సౌకర్యం, ఫారెక్స్ ట్రావెల్ కార్డ్ సేవలు, విమాన టికెట్ బుకింగ్,హాలిడే ప్యాకేజీలు, తక్కువ వడ్డీ రేటుతో గోల్డ్ లోన్లు వంటి సేవలు అందిస్తుందన్నారు.
విజ్ మని సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ ఆర్) కార్యక్రమాలలో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు మండల పరిషత్ ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు పాఠశాల బ్యాగులు, పుస్తకాలను పంపిణీ చేశారు.సమాజ అభివృద్ధికి విజ్ మనీ కట్టుబడి ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, రీజినల్ మేనేజర్ సుబ్బయ్య, బ్రాంచ్ మేనేజర్ నాగగణేష్ సిబ్బంది పాల్గొన్నారు.

