ఘనంగా వైసీపీ 26వ వసంతాల వేడుకలు

Spread the love

కడప జిల్లా మార్చి 12

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట పట్టణంలోని నూనివారిపల్లి రోడ్డులోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అకేపాటి భవన్ లో గురువారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ దినోత్సవం సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాధ్ రెడ్డి,నాయకులు జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు
నిర్వహించుకున్నారు
ఈ సందర్బంగా విశ్వనాధ్ రెడ్డి మాట్లాడుతూ
ప్రజల ఆశయాల సాధన కోసం పుట్టిన ప్రజాపార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని
దివంగత మహానేత
డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సంకల్పంతో 2011 మార్చి 12న ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు 16వ వసంతంలోకి అడుగుపెడుతోన్న
శుభసందర్బంగా పార్టీ స్థాపకులు,ప్రజానాయకుడు,ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి స్ఫూర్తిదాయక నాయకత్వంలో రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
నిజాదల్వర్గంలోని నాయకులు,కృషిశీల కార్యకర్తలు, అభిమానులందరూ ఐక్యతతో పార్టీ సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకెళ్లుతూ పార్టీని మరింత బలోపేతం చేయాలనికోరుకుంటు
16 సంవత్సరాల ప్రయాణం
పోరాటాలు – విజయాలు ప్రజల విశ్వాసంమన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు జబ్బిరెడ్డి వెంకటరెడ్డి,సుబ్బరాజు, సురేంద్ర,దండు గోపి, అమర,శివయ్య,ఓబయ్య, మనోహర్ రెడ్డి, రఘునాథరెడ్డి, పెంచలయ్య, సురేఖ, శ్రీవాణి, చికెన్ శీను, జాహిద్ అలీ, గోవింద బాలకృష్ణ, కళ్యాణ్ రెడ్డి, బాల్ రెడ్డి, శ్రీకృష్ణ లాడ్జ్ అధినేత శీను, కిషోర్,శీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *