వేసవి రోజులలో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేసిన ఫ్యూచర్ మైండ్స్ పాఠశాల కరస్పాండెంట్ నందకిషోర్

Spread the love

కడప జిల్లా మార్చి 12

(,నవ్యంధ్ర న్యూస్ )

మార్చి 16 సోమవారం నుండి ఎండలు ఎక్కువ అవుతున్న కారణంగా ప్రభుత్వం ఒంటిపూట బడులు (మార్నింగ్ స్కూల్స్) నిర్వహించాలని ఆదేశించిన కారణంగా ఫ్యూచర్ మైండ్స్ స్కూల్ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మార్నింగ్ స్కూల్ 16వ తేది సోమవారం నుండి నిర్వహింస్తున్నట్లు కరస్పాండెంట్ నందకిషోర్ తెలియజేస్తూ
14 వ తేదీ శనివారం
టైమ్ టేబుల్ విద్యార్థులకు అందిస్తామని బ్రేక్ టైమ్ లో తల్లిదండ్రులు టిఫిన్ తీసుకొని వచ్చి విద్యార్థులకు అందించగలని
విద్యార్థుల పై శ్రద్ధ వహించాలని
ఎండలు ఎక్కువ కారణంగా మార్నింగ్ స్కూల్ నిర్వహింస్తునందున్న విద్యార్థులు మధ్యాహ్న సమయంలో క్రికెట్ ఆడడానికో లేక స్నేహితులతో తిరగడానికి బయట వెళ్తుంటారు గమనించి కట్టడి చేయాలని .ఎండవేడిమి భారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలనిఎండాకాలంలో వడదెబ్బ,డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి,తగినంత నీరు (కుండ నీరు) కొబ్బరి నీళ్లు తీసుకోవడం, కాటన్ దుస్తులు ధరించడం, మధ్యాహ్నం ఎండలో బయట తిరగకపోవడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించి శారీరక శ్రమను తగ్గించుకుని, నీడలో విశ్రాంతి తీసుకోవాలని
హైడ్రేషన్ (నీటి శాతం): రోజూ తగినంత మంచినీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, తాజా పండ్ల రసాలు తాగాలని
తేలికగా అరిగే ఆహారం, పండ్లు, కూరగాయలు (దోసకాయ, పుచ్చకాయ) ఎక్కువగా తీసుకోవాలని వేడి, కారంగా ఉండే పదార్థాలను తగ్గించాలని .
వస్త్రధారణ: తేలికపాటి కాటన్ దుస్తులు, లేత రంగు దుస్తులు ధరించాలని
మధ్యాహ్నం 1:00 గంట నుండి సాయంత్రం 4:00 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని బయటకు వెళ్ళేటప్పుడు గొడుగు, టోపీ, సన్‌గ్లాసెస్ (Sunglasses) ధరించాలని కుండలో ఉంచిన నీటిని తాగడం వల్ల శరీరం సహజంగా చల్లబడుతుంది.
కూల్ డ్రింక్స్ అస్సలు తీసుకోకుండా చూడాలని
విపరీతమైన దాహం, తలతిరగడం, వాంతులు, అలసట,చర్మం,ఎర్రబడటం. వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నీడలో విశ్రాంతి తీసుకుని, ఓ.ఆర్.ఎస్ (ORS) లేదా ఉప్పు-చక్కెర నీరుతాగాలి.ఎండాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి
ఈ జాగ్రత్తలను,వైద్యుల సలహాలు తప్పకుండా పాటించాలని విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా కరస్పాండెంట్ నందకిశోర్ జాగ్రత్తలు అందించారు తప్పకుండ ఆచరించాలని ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *