కడప జిల్లా మార్చి 08
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట మండలపరిధిలోని మదనగోపాలపురం రోడ్డులోని రాజీవ్ స్వగృహ ఆవరణంలో ఎర్పాటు చేసిన పంచముఖ వినాయక స్వామి ఆలయంలో ఆదివారం రాష్ట్ర క్షత్రియ సంఘ డైరెక్టర్ అద్దేపల్లి ప్రతాప్ రాజు ప్రవాస భారతీయుల యోగక్షేమాలు ఆకాంక్షిస్తూ పంచముఖ వినాయక స్వామికి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అద్దేపల్లి ప్రతాప్ రాజు మాట్లాడుతూ ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా జరుపుతున్న యుద్ధంలో గల్ఫ్ దేశాలపై ఇరాన్ జరుపుతున్న దాడులలో మన భారతీయులకి ఎటువంటి హాని కలగకుండా , గల్ఫ్ దేశాలలో పాక్షికంగా దెబ్బతిన్న ఎయిర్ పోర్ట్ పునః ప్రారంభం కావాలని, భారతీయులందరు, రాజంపేట,కోడూరు ప్రాంత ప్రజలు వారి వారి ప్రదేశాలకు సురక్షితంగా చేరుకోవాలని కోరుకున్నన్నారు.

