కడప జిల్లా మార్చి 03
(నవ్యంధ్ర న్యూస్ )
జాతీయస్థాయిలో రాజంపేట క్రీడాకారులు పథకాలు సాధించడం రాజంపేటకు
గర్వకారణమని జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు అన్నారు.
రాజంపేట ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మార్చి ఒకటవ తేదీ గుంటూరులో నిర్వహించిన జాతీయ
స్థాయి టైక్వాండో పోటీలలో పథకాలు సాధించిన క్రీడాకారులనుమంగళవారం జనసేన కార్యాలయం యల్లటూరు భవన్ లో అభినందించి పతకాలు, సర్టిఫికెట్లు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
రాజంపేట నుండి ఎనిమిది మంది క్రీడాకారులు పోటీలో పాల్గొనగా 5 మంది స్వర్ణ పతకాలు, ముగ్గురు రజత పతకాలు సాధించారు. స్వర్ణ పథకాలు కె.సాయి, కె.వినయ్ కుమార్, ఎం.రామ్ నరసింహ రితేష్, వై.పెంచల్ ప్రభాస్, గౌతమ్, టీ.గోకుల్ చౌదరి సాధించగా
రజిత పథకాలు ఎం.లోకేష్, ఎం.పూర్ణేష్, కె.హేమంత్ లు సాధించారు.
స్వర్ణ,రజిత పథకాలు సాధించిన వారిని యల్లటూరు శ్రీనివాస రాజు ఘనంగా సత్కారించి స్వీట్ బాక్సులు అందజేశారు.
ఈ సందర్భంగా యల్లటూరు శ్రీనివాసుల రాజు మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ సాధన వలన ఆత్మరక్షణ, ఆరోగ్యంతో పాటు జీవితంలో క్రమశిక్షణ అలవడుతుందన్నారు.
కూటమి ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేసిందని, క్రీడాకారులకు క్రీడా కోటా ద్వారా ఉన్నత చదువులు, ప్రభుత్వ ఉద్యోగాలలో మెరుగైన అవకాశాలు లభిస్తాయన్నారు. క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్ధుతున్న మాస్టర్ బి.సునీల్ ను ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారులకు ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కోచ్ లు టీ.చంద్రశేఖర్, కె.గంగారామ్, క్రీడాకారుల తల్లిదండ్రులు శివ,కృష్ణ, వెంగల్ రావు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

