కడప జిల్లా ఫిబ్రవరి 27
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట మండల
పరిధిలోని కారంపల్లి పంచాయితీలో హిందూ స్మశానవాటికలో మండల అభివృద్ధి నిధులతో బోరు మంజూరు కాగా శుక్రవారం శ్రీ కాశీ విశ్వనాధ స్మశాన అభివృద్ధి కమిటీ అధ్యక్ష, కార్యదర్శి,కార్యవర్గ
సభ్యులు బోరు వేస్తూన్న శుభ సందర్బంగా భూమి పూజనిర్వహించారు.
ఈ సందర్బంగా అధ్యక్ష, కార్యదర్శి,కార్యవర్గ
సభ్యులు మాట్లాడుతూ హిందూస్మశానఅభివృద్ధికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు,
దాతలు,స్వచ్చంద సంస్థలు,తదితరులు
సహాయ సహకారాలు
అందించాలని,ఎవ్వరైన సహృదయులు హిందూ స్మశాన వాటికను దత్తత తీసుకుని సుందరికరణ చేయాలని కోరుతూ హిందూ స్మశాన వాటిక అభివృద్ధికి షహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, దాతలకు
ధన్యవాదములు తెలియజేసారు.

