జేఎసి అధ్యక్షులు ఆలపర్తిని ఘనంగా సత్కారించిన ఎన్జిఓ అధ్యక్ష,కార్యదర్శి,కార్యవర్గ సభ్యులు.

Spread the love

కడప జిల్లా ఫిబ్రవరి 27

(నవ్యంధ్ర న్యూస్ )

రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలలో జేఏసీ కమిటీల ఏర్పాటులో భాగంగా జిల్లా జేఏసీని ఏర్పాటు చేసి
జిల్లా ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షులుగా బలపనూరు శ్రీనివాసులును జేఏసీ అధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాసులు శుక్రవారం మొట్టమొదటిసారిగా జేఏసీ అధ్యక్షులు బాధ్యతలు తీసుకున్నక మొట్టమొదటిసారిగా రాజంపేటకు ఎన్జిఓ అసోసియేషన్ కార్యాలయానికి విచ్చేసిన శుభసందర్బంగా అధ్యక్షులుశ్రీనివాసులను ఎన్జిఓ అధ్యక్ష,కార్యదర్శి, కార్యవర్గసభ్యులు
ఘనంగాసత్కారించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
గత ఆరుసంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల అలపర్తి విద్యాసాగర్ జేఏసీ అధ్యక్షులు ఏపీ ఎన్జీవోస్
అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ డివి రమణ ఆధ్వర్యంలో రాయితీలను ఒక్కొక్కటిగా ప్రభుత్వంతో సామరహస్యంగా
పరిష్కరించుకునేందుకు కృషిచేస్తామన్నారు.
ఐ ఆర్,జిపిఎఫ్, సరెండర్ లీవ్ ల బకాయిలను రాష్ట్ర జేఏసీ అధ్యక్షుల వాగ్దానం మేరకు నెరవేరుతాయన్నారు. ముఖ్యమంత్రిని ఒప్పించి 12వ పిఆర్సీ 30% ఇప్పించడానికి రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు కృషి చేస్తున్నారన్నారు.
ఏపీఎన్జీవోస్
అసోసియేషన్ అధ్యక్షులు
యం.వరదయ్య కార్యదర్శి,విజయ్ కృష్ణ, సారధ్యంలో సాధించుకుంటా
మన్నారు..
ఈ కార్యక్రమంలో
జిల్లా కోశాధికారి
బి. శ్రీనివాసరాజు,
జిల్లా రైల్వే కోడూరు అధ్యక్షుడు పి.ఓబులేశు, సంయుక్త కార్యదర్శి పద్మనాభరావు,తాలూకా అసోసియట్ అధ్యక్షులు,
ఎన్ హరిప్రసాద్ బాబు,వైస్ ప్రెసిడెంట్
కెబిటివి నాయుడు,
సంయుక్త కార్యదర్శి టి.వెంకటసుబ్బయ్య,
బి.మణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *