శాన్విలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన

Spread the love

ఉచితంగా లక్ష రూపాయల మందుల పంపిణీ

కడప జిల్లా ఫిబ్రవరి 22.

(నవ్యంధ్ర న్యూస్ )

సయ్యద్ మహబూబ్ జాన్ జ్ఞాపకార్థంగా రాజంపేట మండలపరిధిలోని తాళ్లపాక ఎల్లగడ్డలోని శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ లో ఆదివారం వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ మాజీ వైస్ ప్రెసిడెంట్ కొండూరు శరత్ కుమార్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించినది.
ఈ వైద్యశిబిరంలో వైద్యనిపుణులైన వివిధ విభాగాలకు చెందిన వైద్యులచే చికిత్సలు చేయించుకున్నారు.
ఈ వైద్యశిబిరంలో లక్ష రూపాయల విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
వైద్యశిబిరం
ప్రారంభోత్సవ సమావేశ వేడుకలో పాల్గొన్న వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ పి రవిరాజు మాట్లాడుతూ వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆర్గనైజేషన్ ఆరోగ్యంగా ఉంటే అన్నీ ఉన్నట్టే అన్న లక్ష్యంతో సామాజిక సేవలు, ఆరోగ్యసేవలకు ప్రాధాన్యతనిస్తూ సేవలను విస్తరింప
జేస్తున్నామన్నారు . ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2 వేల క్లబ్ లలోని రెండున్నర లక్షల సభ్యులతో క్లబ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నమన్నారు. క్లబ్ ఆర్గనైజేషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ కొండూరు శరత్ కుమార్ రాజు మాట్లాడుతూ పేదలు, మధ్యతరగతి ప్రజలు వాకర్స్ అసోసియేషన్ నిర్వహించే ఉచిత వైద్యశిబిరంలో అందించే వైద్యసేవలలో చికిత్స పొందే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని
మా శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
భవిష్యత్తులో వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్,
శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ సంయుక్తంగా సామాజికంగా
ఆధ్యాత్మికంగా సేవలందింస్తామన్నారు.
ఈ ఉచిత మెగా శిబిరంలో పరిసర ప్రాంతాలలోని ప్రజలు విచ్చేసి చికిత్సలు పొందడంతో
ఈ ప్రాంతంలో మరిన్ని ఉచిత మెగా వైద్య శిబిరాలు
నిర్వహించాలన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు సామాజికంగా సేవా కార్యక్రమాల ఫై అవగాహన కల్పించడం ప్రస్తుత సమాజానికి ఎంతోఅవసరమన్నారు. ఈ ఉచితవైద్యశిబిరానికి సహకరించిన వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ కోనేటి రవిరాజు, కోశాధికారి మునికృష్ణ, సభ్యులు సయ్యద్ నాసరుద్దీన్, చేజర్ల సుబ్రమణ్యం రాజు,
కే సుబ్బరామరాజు, డాక్టర్ టీ. పెంచలయ్య, ఏ. వెంకటయ్య నాయుడు,కే.భరత్ కుమార్ రాజు, నందలూరు వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ చెందిన రామ్మోహన్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. మెగా వైద్య శిబిరంలో పుత్తూరు ఆశ్రిత హాస్పిటల్ కి చెందిన ఇంటర్నేషనల్
ఆర్గనైజేషన్ అధ్యక్షుడు షుగర్ వ్యాధి నిపుణులు వైద్యులు పి. రవిరాజు, తిరుపతికి చెందిన గుండె వైద్య నిపుణులు వైద్యులు
సి.వెంకటరమణ, స్త్రీల వైద్య నిపుణురాలు వైద్యులు ఆర్. నిరూపమ, తిరుపతి డివిఆర్ అండ్ ఎస్కే హాస్పిటల్స్ కు చెందిన సర్జికల్ ఆంకాలజీ వైద్యులు సి. జయప్రకాష్, ఆర్థో నిపుణుడు వైద్యులు డి. మధు కృష్ణారెడ్డి, తిరుపతి ప్రమీల హాస్పిటల్ కి చెందిన జనరల్ సర్జన్ డాక్టర్ ఎస్. బలరామరాజు, జానకిరామ చెస్ట్ హాస్పిటల్కి చెందిన ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధి నిపుణులు వైద్యులు ఎస్. బాలరాజు, తిరుపతి యుగంధర్ హాస్పిటల్ కి చెందిన చర్మవ్యాధి నిపుణులు వైద్యులు యుగంధర్, తిరుపతి పార్థ డెంటల్ కేర్ హాస్పిటల్ చెందిన వైద్యులు వి.వి. సుబ్బారెడ్డి, వైద్యులు సూర్య రామలక్ష్మి, వైద్యులు లాస్య,
తిరుపతికి చెందిన వంశీ ఆర్థోకేర్ వైద్యులు నంది మండలం వంశీకృష్ణ, తిరుపతి హరే కృష్ణ నేత్రాలయానికి చెందిన వైద్యులు ఏ. సిద్ధార్థ రెడ్డి,భరత్ గుండె,జనరల్ క్లినిక్ చెందిన డాక్టర్ ఎన్. భరత్ తేజ్ తదితర వైద్యులు ఈ మెగా వైద్య శిబిరంలో చికిత్సలు నిర్వహించడం,
శిబిరం ప్రారంభోత్సవ వేడుకలో వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్, పట్టణానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *