అకేపాటి భక్తి చూసి మతి భ్రమించి మాట్లాడుతున్న టీడీపీ నియోజకవర్గం ఇంచార్జ్ చమర్తి

Spread the love

కడప జిల్లా ఫిబ్రవరి 22

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట వైసీపీ కార్యాలయంలో ఆదివారం వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాధ్ రెడ్డి, దండు గోపి వైసీపీ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థాన కల్యాణ
మండపం ఫై మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం
శ్రీ వెంకటేశ్వరస్వామిని రాజకీయంగా
వాడుకుంటే నాశనం అయిపోతారని
22 తిరుమల మహా పాదయాత్రలు చేపట్టి
శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద మాల ధరించి 40 రోజులు దీక్షలతో కాలినడకన వెంకటేశ్వర స్వామిని దర్శించు
కుంటున్న అకేపాటిని విమర్శించడం మీకు తగునా అన్నారు.
ఎంతో భక్తి శ్రద్ధలతో తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్రలేచి గోపూజ చేసే అకేపాటి ఫై నిందలు వేస్తున్నారన్నారు.
నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ తనను ఎవ్వరు ఆశ్రయించిన పార్టీలకు అతీతంగా సమస్యలను పరిష్కరిస్తూన్నరన్నారు. ఆకేపాటి అమర్నాథరెడ్డికి ఎలాంటి వ్యాపారాలు లేవని,ఎలాంటి
కాంట్రాక్టర్లు లేవని నిరంతరం ప్రజాసేవే
లక్షంగా పనిచేస్తూన్నరని
పదే పదే భూకబ్జాలు భూకబ్జాలంటూన్నరని మీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలన్నారు.
అకేపాటి కుటుంబం భూస్వామి కుటుంబమని ఆకేపాడు ప్రాంతంలో ఏ ఒక్కరిని అడిగినా చెప్తారని
ఆకేపాడు పరిసర ప్రాంతాలలోని పేదవారికి పెళ్లిళ్లు చేసుకోవడానికి ఒక కళ్యాణ మండపం కావాలన్న ఆ ప్రాంత ప్రజల కోరిక మేరకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో కళ్యాణ మండపం నిర్మాణానికి తన భూమిని తిరుమల తిరుపతి దేవస్థానానికి రిజిస్టర్ చేయించారన్నారు.
టీటీడీ కళ్యాణ మండలం అకేపాటి కబంధ హస్తలలో ఉందంటున్నా మీకు అకేపాటి సొంత ఆస్తి ప్రజల కోసం టీటీడీకి రిజిస్టర్ చేయించి ప్రజల ప్రయోజనం కోసం ఉపయోగించాలన్నదే అకేపాటి ఆశయ
మన్నారు.టీటీడీ కళ్యాణ మండప నిర్మాణం దశలవారీగా పూర్తి అవ్వుతుందని టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణ పనులు పూర్తి కాలేదన్నారు.ప్రతిసారి భూకబ్జాలు భూకబ్జాలు అంటూ పదే పదే మీడియా వేదికగా దుష్ప్రచారం చేయడం
సరికాదన్నారు. బినామీలు వెన్నుపోట్లు మీకు,మీ అదినాయకునికి అలవాటు ఎమో
మా నాయకుడికి కాదని నీకు కాకుండా
నీ అధిష్టానం వేరే వ్యక్తికి పోటీ చేసే అవకాశం కలిపించలేదని స్వయంగా నువ్వే కొందరితో చేతులు కలిపి పార్టీకి ద్రోహం చేసి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావా అన్నారు.నీ ఇంచార్జ్ పదవి కాపాడుకోవటం కోసం తప్పుడు మాటలు మాట్లాడు
తున్నావన్నారు.
మీ ప్రభుత్వం పాలన చేపట్టి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్న నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారా,
మీమ్మల్ని ఇన్చార్జిగా నియమించి 100 రోజులులైన నియోజక
వర్గానికి ఏమి చేశారన్నారు.
ఇంకొకసారి
శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా
వాడుకుంటే పుట్టగతులు ఉండవన్నారు.
ఈ సమావేశంలో
జిల్లా యస్.సి సెల్ కార్యదర్శి గొంటు మణి,నియోజకవర్గ యస్.సి సెల్ అధ్యక్షుడు దాసరి పెంచలయ్య,
నియోజవర్గ ఆర్.టి. ఐ అధ్యక్షుడుసుబ్బరాజు,రపట్టణ యస్.సి సెల్ అధ్యక్షుడు బొజ్జ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *