అన్నమయ్య జిల్లా ఫిబ్రవరి 19
(నవ్యంధ్ర న్యూస్ )
ఆంధ్రప్రదేశ్ ఎరుకుల అభిరుద్ది సంఘ రాష్ట్ర కార్యాలయంలో గురువారం రాష్ట్ర అధ్యక్షులు పూజారి
రెడ్డిశేఖర్ చిన్నపిల్లల పై జరుగుతున్న దారుణ అఘాయిత్యాల పై మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా
రాష్ట్ర అధ్యక్షులు పూజా రెడ్డి శేఖర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ,గిరిజన,పట్టణ ప్రాంతాలలో చిన్న పిల్లల పై జరిగే దారుణ అఘాయిత్యాలు (హత్యలు,అల్లర్లు, లైంగిక వేధింపులు ) భయానకంగా పెరుగుతున్నాయి. ఎరుకుల అభిరుద్ది సంఘ నాయకులు తీవ్రఆందోళనచెందుతూ .ప్రస్తుత చట్టాలతో తగిన రక్షణ ఇవ్వలేనందునే
ఈ అఘాయిత్యాలు చోటు చేసు
కుంటున్నాయని
ఈ అఘాయిత్యాల పై ప్రత్యేక చట్టం తీసుకురావాలని
ఆంధ్రరాష్ట్ర కూటమి ప్రభుత్వ పాలకులు ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రిని కోరుతున్నామన్నారు. ప్రత్యేక చట్టంలో కీలక అంశాలు:చిన్న పిల్లలపై నేరాలకు మరణశిక్ష లేదా జీవిత ఖైదుతప్పనిసరిగా ఆమోదించి,
త్వరితగతిన విచారణ చేపట్టెందుకు స్పెషల్ న్యాయస్థానాలు,.
సీసీ టీవీలు,పోలీసులు అవగాహనాకార్యక్రమాల ద్వారా నిరోధక చర్యలు తప్పనిసరిగా చేపట్ట
వలసినదిగా కోరుతున్నామన్నారు..
రాష్ట్ర,జిల్లాల కమిటీ సంఘ సభ్యుల డిమాండ్ చేస్తున్నామన్నారు.. సమాజం,మీడియా, స్వచ్ఛంద సంస్థలు
ఈ డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.
ముఖ్యమంత్రి త్వరగా చర్యలు తీసుకుని
ఈ అఘాయిత్యాలను అరికట్టుకుంటే
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నామన్నారు.

