శ్రీ కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామిఅమ్మ వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన – తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి దంపతులు.

Spread the love

అంగరంగ వైభవంగా హత్యరాల తేతేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం.

చమర్తి దంపతులకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ అధ్యక్షులు,,
ఈవో,వేద పండితులు.

హత్యరాల పుణ్యక్షేత్రాన్ని వేగంగా అభివృద్ధి చేస్తాం .

కడప జిల్లా ఫిబ్రవరి, 16

(నవ్యంధ్ర న్యూస్ )

పవిత్ర పుణ్యక్షేత్రం
శ్రీ కామాక్షి త్రేతేశ్వర స్వామి మహాక్షేత్రంగా రూపుదిదేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు.
రాజంపేట మండల
పరిధిలోని హత్యరాలలో వెలసియున్న
పరమపవిత్ర పుణ్యక్షేత్రమైన
శ్రీ కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజు సోమవారం వైభవంగా నిర్వహించిన కల్యాణ మహోత్సవానికి నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు దంపతులు స్వామివార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ ఎంతో మహిమ గల హత్యరాల శ్రీ కామాక్షి త్రేతేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి
ప్రభుత్వ సారధిగా
పట్టు వస్త్రాలు సమర్పించడం చాలా ఆనందంగాఉందని,
ఈ శ్రీ కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామి కళ్యాణం అందరికి మంచి చేకూరాలని
లోక కళ్యాణంగా భావిస్తూ ప్రతి భక్తుని పై స్వామివారి కృప కటాక్షాలు ఉండాలని జగన్ మోహన్ రాజు ఆకాంక్షించారు.
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని ఏర్పాట్లుచేశామని,
భవిష్యత్తులో గొప్ప క్షేత్రంగా రూపుదిదేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
2027సంవత్సరంలో
శ్రీ కామాక్షి సమేత త్రేతేశ్వర కల్యాణన్ని కనులవిందుగా నిర్వహించేలా ఏర్పాటులు చేస్తామన్నారు.
భవిష్యత్తులో హత్యరాల పుణ్యక్షేత్ర ప్రాముఖ్యతను రాష్ట నలుమూలల ప్రత్యేక గుర్తింపు వచ్చేలా
శ్రీ కామాక్షి సమేత
త్రేతేశ్వర స్వామి మహాశివరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తామన్నారు.
అనంతరం చమర్తి జగన్ మోహన్ రాజును ఆలయ అధ్యక్షులు పూల నాగమణి నరసింహులు,ఆలయ
ఈవో,వేద పండితులు పూర్ణకుంభంతో మంగళ వాయిద్యాలు,వేద
మంత్రాల మధ్య చమర్తి దంపతులకు ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల మండల స్థాయి అధికారులు,అలయ డైరెక్టర్లు,తెలుగుదేశం
నాయకులు,తదితరులుపాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *