కడప జిల్లా ఫిబ్రవరి 11
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేటలో బుధవారం ఫీజు రియంబర్స్మెంట్ 1200 కోట్లు విడుదల చేసిన సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థుల మెరుగైన విద్యా ప్రమాణాలు
నెలకొల్పేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. రియంబర్స్మెంట్ 1200 కోట్ల రూపాయలు విడుదల చేశారని గతంలో ఫీజు రియంబర్స్మెంట్ ను గాలికి వదిలేసి విద్యార్థుల ప్రాణాలతో చలగాటమాడారని గుర్తు చేశారు. లోకేష్ చిత్తశుద్ధితో ఉంటూ విద్యార్థుల పక్షాన నిలబడుతున్నారన్నారు.ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ స్థానిక పార్లమెంట్ అధ్యక్షులు పోలి శివకుమార్, నాయకులు సురేష్,రఫీ, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

