వ్యాపారస్థులు రహదారుల పై వ్యాపారాలు నిర్వహిస్తే వాహనం,వ్యాపారసామాగ్రి సీజ్ చేస్తామని హెచ్చరించిన మునిసిపల్ కమిషనర్

Spread the love

ట్రాఫిక్ సమస్యలు నివారించేందుకు వ్యాపారస్థులు సహకరించాలి.

కడప జిల్లా ఫిబ్రవరి 11

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట పట్టణంలోని ప్రధాన రహదారులపై వ్యాపారం నిర్వహిస్తున్న చిరు వ్యాపారస్తులు రహదారుల పై తోపుడు బండ్లు,ఇతర సామగ్రిని ఏర్పాటు చేయడం వలన వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతున్నట్లు
గమనించిన నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ ఎస్. లక్ష్మీనారాయణ బుధవారం స్వయంగా రహదారులను
పరిశీలించారు.
ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్ల పై వ్యాపారం నిర్వహిస్తున్న
చిరు వ్యాపారస్తులకు హెచ్చరికలు జారీ చేశారు.ప్రజల సౌకర్యం,ట్రాఫిక్ సౌలభ్యం దృష్ట్యా రహదారుల పై వాహనాలకు అడ్డంగా వ్యాపారం చేయరాదని, తమ తోపుడు బండ్లు,
వ్యాపార సామగ్రిని వెంటనే రహదారి నుంచి తరలించుకోవాలన్నారు. మున్సిపాలిటీ ఆదేశాలను పట్టించుకోకుండా రహదారుల పై వ్యాపారం కొనసాగించిన పక్షంలో,సంబంధిత వాహనాలు,సామగ్రిని మున్సిపాలిటీ స్వాధీనం చేసుకుని సీజ్ చేస్థామన్నారు.
మునిసిపల్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు నివారించి ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం
కల్పించేందుకు అందరూ సహకరించాలన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *