రాష్ట్రం మీ జాగిరు కాదు, ప్రజలు మీ బానిసలు కాదు చంద్రబాబు

Spread the love

కడప జిల్లా ఫిబ్రవరి 01

(నవ్యంధ్ర న్యూస్ )

రాష్ట్రం మీ జాగిరు కాదని,ప్రజలు మీ బానిసలు కాదని,ఎల్లపుడు మీ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందనిఅనుకోవద్దని
మీ పాలనలో మీరు పెంచి పోషిస్తున్న అరాచకం మానై పెరుగి మీ పార్టీని ముంచి
వేయడం ఖాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు పై వైసీపీ జిల్లా అదికారప్రతినిధి పాపినేని విశ్వనాధ్ రెడ్డి మండిపడ్డారు.
తిరుమల తిరుపతి లడ్డు అంశంలో సిబిఐ ఎలాంటి కల్తీ జరగలేదని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రజలలో అబాసుపాలు అయ్యారనే లడ్డు
అంశాన్ని డైవర్ట్ చేసేందుకే శనివారం కాపు సామాజిక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి పై దాడి చేసి రాంబాబు అక్రమ అరెస్ట్ చేయడం హేయమైన చర్య అన్నారు. రెండు రోజులు వ్యవదిలోనే ఇద్దరు మాజీ మంత్రుల గృహల పై తెలుగుదేశం నాయకులు చేసిన దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని. ప్రజలు తిరగబడే రోజులు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చంద్రబాబు, నారా లోకేష్ ఆలోచించుకోవాలని ఆరోజు కూడ త్వరలోనే వస్తుందన్నారు.ప్రజలు ఓటు వేసి గెలిపించింది ప్రజాస్వామ్య పద్దతిలో పరిపాలన చేయమని ఓట్లు వేశారు కానీ ఇలా ప్రతిపక్ష నాయకులు,, సామాన్య ప్రజల పై దాడులు చేయమని కాదని గుర్తుంచుకోవాలని ఎంతసేపు డైవర్శన్ పాలిటిక్స్ చేస్తూ ఎన్నిరోజులు పబ్బం గడుపుతావని,చేతిలో అధికారం ఉందని ప్రతిపక్ష నాయకుల పై దాడులు చేస్తుంటే ఎవరు చూస్తూ ఉండరని అధికారం ఎవరికి శాశ్వతం కాదని సమయం వచ్చినప్పుడు ఇలా దాడులు చేస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణుల పరిస్థితి ఏమిటని ఒకసారి అలోచించి ఇకనైనా దౌర్జన్యలు, దాడులు మానుకొని ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగించాలని ఒక ప్రకటనలో తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *