గీతాంజలి ప్రీమియర్ లీగ్ క్రికెట్ ఫైనల్స్ విజేతకు ట్రోఫీ అందచేసిన జనసేన నేత అతిగారి కృష్ణ.

Spread the love

కడప జిల్లా జనవరి 12

(నవ్యంధ్ర న్యూస్ )

ప్రతి సంవత్సరంలాగే
ఈ సంవత్సరం కూడా గీతాంజలి అధినేత సంభావు వెంకటరమణ కుమారుడు వినయ్ ఆధ్వర్యంలో రాజంపేట మండలపరిధిలోని ఊటుకూరు గ్రామ పంచాయతీ వెంకటరాజం పేటలో సంక్రాంతి వేడుకలలో భాగంగా
గత 30 రోజులుగా
40 టీములు ఈ క్రికెట్ పోటీలలో పాల్గొని.
సోమవారం నిర్వహించిన ఫైనల్ పోటీలో టీ.కమ్మపల్లి,బలిజపల్లి, వెంకట రాజంపేట జట్ల మధ్య రసవత్తరంగా కొనసాగి విజేతలుగా
టీ.కమ్మపల్లి బలిజపల్లి గ్రామ పంచాయతీ జట్లు నిలిచాయి,ఈ నెల రోజులుగా ఈ పోటీలలో విజేత జట్టుకు 50000 రూపాయల నగదుతో పాటు ట్రోఫీని జనసేన పార్లమెంట్ సమన్వయ కర్త అత్తిగారికృష్ణ
తెలుగుదేశం పార్లమెంట్ లీగల్ సెల్ అధ్యక్షుడు తరిగోపుల
లక్ష్మీనారాయణ,
గీతాంజలి అధినేత తెలుగుదేశం నాయకులు సంభావువెంకటరమణ.యువనేత కంబాయి గారి లక్ష్మీ నరసింహ,కూటమి నేతలుఅందజేశారు.
క్రికెట్ రన్నర్స్ జట్టుకు 30000 రూపాయల నగదు రన్నర్స్ ట్రోఫీ అందజేసారు.
ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ ఎంతో మంది ఉత్తమ క్రీడాకారులను
ఈ దేశానికి,రాష్ట్రానికి అందచేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం
యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ
ఈ పోటీలను
శ్రమనుకోకుండా
నిర్వహిస్తున్నామన్నారు.బెస్ట్ బౌలర్,బెస్ట్ బ్యాట్స్ మన్,మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్,సిరీస్,
అందజేశారు.
ఈ సందర్భంగా అత్తికారి కృష్ణ మాట్లాడుతూ క్రికెట్ జట్టు ఆడిన ప్రతి ఆటగాడు రాష్ట్రా,జిల్లాకు ఎంపిక కావడానికి
ఏవిధంగా కష్టపడాలో మెలుకువలు తెలియ జేశారు.భవిష్యత్తులో క్రీడాకారులకు తన వంతు సహాయం అందిస్తానన్నారు.
శ్రీ లక్ష్మీనారాయణ
శ్రీ నరసింహలు మాట్లాడుతూ గీతాంజలి రమణ ఈ మ్యాచ్ నిర్వహణకు ఎంత శ్రమ పడుతున్నది చక్కగా వివరించారు.
లయన్స్ క్లబ్ ద్వారా ఏదైనా సహాయం కావాలన్న అందజేస్తామని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కోశాధికారి నరసింహ అన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన కడప నేత రమణ,అగ్రహారం
చల్లా సుధాకర్, అబ్బిగారిగోపాల్,
తోటరామయ్య,
వెంకటస్వామి. ఉద్దండంసుధాకర్. శివ,ప్రభాకర్,శ్రీను,తేజ పాండు,చంధ్ర, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *