మదనపల్లి జిల్లా జనవరి 06
(నవ్యంధ్ర న్యూస్ )
37వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా మంగళవారం రాయచోటి పట్టణంలో జిల్లా ఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కడప రింగ్ రోడ్ నుంచి బంగ్లా వరకు సాగిన ఈ ర్యాలీలో ఎస్పీ స్వయంగా హెల్మెట్ ధరించి పాల్గొన్నారు. ద్విచక్ర వాహన ప్రమాదాలలో తలకు గాయాలే ప్రధాన కారణమని, ఐఎస్ఐ హెల్మెట్ ధరిస్తే ప్రాణాపాయం నుంచి రక్షణ లభిస్తుందని తెలిపారు. ‘నో హెల్మెట్ – నో ఫ్యూయల్’ నిబంధనను కఠినంగా అమలు చేస్తామని హెచ్చరించారు.

