ఎన్నికల హామీలలో జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటిస్తామని ఇచ్చిన హామీని అమలుచేయాలని ముఖ్య మంత్రిని108అన్నమయ్య విగ్రహం వద్ద వినూత్నంగా నిరసన తెలిపి వేడుకున్న JAC నాయకులు,శరత్ కుమార్ రాజు, విద్యార్థులు

Spread the love

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 28

(నవ్యంధ్ర న్యూస్ )

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలని అమలుచేస్తున్న ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కేంద్రం గా రాజంపేటను ప్రకటిస్తానన్న హామీ కూడా అమలు చేసి ఎన్నికల హామీలన్ని నిరవేర్చిన ఎకైక
ముఖ్యమంత్రి
చంద్రబాబేనని,
విజన్ ఉన్న ఎకైక ముఖ్యమంత్రేనని నిరూపించుకోవాలని జేఏసి నాయకులు,
న్యాయవాదుల సంఘ మాజీఅధ్యక్షులు,
భారతీయవిద్యానికేతన్,శాన్వి ఇంటర్నేషనల్ పాఠశాలల, లైన్స్ క్లబ్ లైన్,వాకర్స్ ఇంటర్నేషనల్ వాకర్ కొండూరు శరత్ కుమార్ రాజు,విద్యార్థులు వినూత్నరీతిలో కళ్ళకు నల్లగుడ్డ కట్టుకుని మోకాళ్ళ పై కూర్చుని నిరసన తెలియజేస్తూ వేడుకున్నారు.
రాజంపేట మండల
పరిధిలోని
కొత్తబోయినపల్లిలోన 108 అన్నమయ్య విగ్రహం వద్ద ఆదివారం జిల్లా కేంద్రంగా రాజంపేట ను ప్రకటించాలని జేఏసీ నాయకులు,కొండూరు శరత్ కుమార్ రాజు, ఆధ్వర్యంలో పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు, విద్యార్థులు,నిరసన కారులు వినూత్న రీతిలో కళ్ళకు నల్లగుడ్డ కట్టుకుని మోకాళ్ళ పై కూర్చుని అన్నమయ్య విగ్రహానికి వేడుకుంటు నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా కొండూరు శరత్ కుమార్ రాజు మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని ప్రజల బాగోగులు బాగుండాలా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం ఉందని నియోజకవర్గ ప్రజానీకం ఆకాంక్షింస్తూన్నారన్నారు. అనంతరం
అన్నమయ్యను మూడు ముక్కలు చేయొద్దు అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థినీ విద్యార్థులతో కలిసి ర్యాలీగా వచ్చి విన్నవించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *