జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని జాయింట్ యాక్షన్ కమిటీ (జేఎసి) చేపట్టిన బంద్ విజయవంతం.

Spread the love

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 23

(నవ్యంధ్ర న్యూస్ )

జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని మంగళవారం నిర్వహించిన బంద్ సంపూర్ణంగా ముగిసినది. వ్యాపారులందరూ స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు.ఆటోలు తిరగకుండా ఆటో కార్మికులే బంద్ నిర్వహించారు.
బస్సులు బస్ స్టాండ్ కు పరిమితమైనవి.
పాత బస్టాండ్ లో ఆటో కార్మికులే ఆటోలు తిరగకుండా బంద్ కు సంపూర్ణంగా
సహకరించారు. కూరగాయల మార్కెట్, పట్టణంలోని దుకాణాల మొత్తం మూతపడ్డాయి. తెల్లవారుజామున 5 గంటల నుంచి
తెరుసు కోవాల్సిన దుకాణాలు ఎవరు తెరవలేదు.ప్రజలు వ్యాపార వర్గాల వారు వాహనదారులు కార్మికులు అన్ని వర్గాల వారు బంద్ కు సహకరించారు.
అన్ని రాజకీయ పార్టీల నాయకులు బంద్ కు తమ సంపూర్ణ సహకారాన్ని అందించడంతో బంద్ సంపూర్ణంగా పరిపూర్ణంగా కొనసాగింది.
జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని జాయింట్ యాక్షన్ కమిటీ కృషితో తెల్లవారుజాము నుంచి చలిని లెక్కచేయకుండా అన్ని ప్రాంతాలలో తిరుగుతూ బంద్ కు సహకరించాలని అన్ని వర్గాల వారిని కోరుతూ కొనసాగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *