విశాఖపట్నం డిసెంబర్ 20
( నవ్యంధ్ర న్యూస్ )
వాకార్స్ ఇంటర్నేసనల్ 34వ కన్వెన్షన్ సమావేశం ఆర్ కె బీచ్ ఉడా కన్వెన్షన్ భవనంలో శనివారం వాకార్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు వాకర్ శ్రీమతి యం.ప్రభావతి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.
ఈ కన్వెన్షన్ లో ముఖ్య అతిధిగా వైజాగ్ పోలీస్ కమిషనర్ శంక బ్రత
బాగ్ జీ పాల్గొన్నారు.
ఈ కన్వెన్షన్ సమావేశంలో వాకార్స్ ఇంటర్నేషనల్ 2024 వాకర్స్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులుగా కొండూరు శరత్ కుమార్ రాజు ఒక్క రోజులో మహాత్మా గాంధీ ఫెల్లోషిప్ సభ్యులుగా 108మంది చే సభ్యత్వం చేయించి ప్రపంచ చరిత్రలో వాకర్స్ ఇంటర్నేషనల్ లో ఉపాధ్యక్షులుగా చేసిన సేవలకు గాను ఉత్తమ ఉపాధ్యక్షులుగా కొండూరు శరత్ కుమార్ రాజుకు ప్రశంస పత్రం, ఇచ్చి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ఎలక్ట్ అధ్యక్షులు వాకర్ డాక్టర్ రవిరాజు, మాజీ అధ్యక్షులు వాకర్ చెలికని. సీతారామయ్య, సెక్రెటరీ జనరల్ వాకర్ సత్యనాధం, కన్వెన్షన్ అధ్యక్షులు వాకర్ గుణ్ణేశ్వర్,సెక్రటరీ కె.
రవిరాజు, ఎలక్ట్ గవర్నర్ చేజర్ల సుబ్రమణ్యం రాజు, తదితరులు పాల్గొన్నారు.

