అన్నమయ్య జిల్లా డిసెంబర్ 14
(నవ్యంధ్ర న్యూస్ )
ఫిబ్రవరి 1వ తేది రాజంపేటలో శివ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో 1008 మంది నృత్య కళాకారులతో
నిర్వహించనున్న నోబుల్ ప్రపంచస్థాయి రికార్డు
శ్రీ అన్నమయ్య కీర్తన నృత్య కైంర్యాన్ని దిగ్విజయం చేయాలని బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ రేనాటి రాఘవేంద్ర వర్మ,
సినీ దర్శకులు శివమణి, ప్రముఖ చిత్రకళాకారులు నాయిని గిరిధర్, ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ బి.సునీల్ లు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమ నిర్వహణ వివరాల పై
పూర్వ అభ్యాసనం ఆదివారం జిఎంసి కళ్యాణమండపంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో
ముఖ్యఅతిథులుగా పాల్గొన్న రాఘవేంద్ర వర్మ, శివమణి,గిరిధర్,సునీల్ లు మాట్లాడుతూ
నృత్యకళ పై మక్కువతో చిన్నతనంలో సినిమా పాటలకు స్టెప్పులేస్తూ జీవితాన్ని ప్రారంభించిన నృత్య గురువు పెనిగలపాటి శివప్రసాద్ నేడు ఎంతోమందికి ఆదర్శ గురువుగా, శాస్త్రీయ నృత్యానికి మకుటంలా నిలిచారన్నారు. శివ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1న నిర్వహించనున్న కార్యక్రమాన్ని
దిగ్విజయం చేసి రాజంపేట కీర్తిని ప్రపంచానికి చాటి
చెప్పాలనిఆకాంక్షించారు. నృత్య గురువు
పెనిగలపాటి శివప్రసాద్ మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటవ తేదీ నిర్వహించే కార్యక్రమానికి నృత్య కళాకారులు సాంప్రదాయ దుస్తులతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులను లక్కీడ్రిప్ ద్వారా ఎంపిక చేసిన పదిమంది కళాకారులకు ఐదు రోజులు ఉచితంగా మలేషియా పర్యటన ఉంటుందన్నారు. సప్తగిరుల స్వామికి నృత్య నైవేద్యం ఇచ్చే అవకాశం పొందిన ప్రతి ఒక్కరూ ధన్యులని, చిత్తశుద్ధితో
ఈకార్యక్రమంలో పాల్గొని జయప్రదంచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నృత్య కళాకారులు,
తల్లిదండ్రులు, వీక్షకులు పాల్గొన్నారు.

