పసుపులేటి శంకర్
అన్నమయ్య జిల్లా డిసెంబర్ 12
(నవ్యంధ్ర న్యూస్ )
విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణగా సాంకేతిక విద్యలో రాణించండంతో పాటు మేధా సంపత్తిని పెంపొందించుకోవాలని హిందూధర్మం టెంపుల్ ప్రేయర్ సొసైటీ ఆర్గనై్సేషన్ జాతీయ అధ్యక్షులు,ఒంటిమిట్ట
శ్రీ పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి శంకర్ అన్నారు.
రాయచోటిలోని భాస్కర్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, సైన్సస్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం కళాశాల విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలలో పాల్గొన్న ముఖ్య అతిదుల చే జ్యోతి ప్రజ్వాల గావించి ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలలో ముఖ్య అతిధిగా డాక్టర్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా శంకర్ మాట్లాడుతూ సాంకేతిక విద్యలో భారతదేశ ప్రతిభ అమోఘ
మైనదన్నారు. మోక్షగుండం
విశవేశ్వరయ్య ,
దేశవారసత్వ కట్టడాలు బృహదీశ్వరాలయం,
కైలాసమందిరం,
ఐరన్ పిల్లర్,బేలూరు శిల్పసంపద,రానీకవావ్ అంశాలను వివరించిన సందర్బంగా విద్యార్థులు కరతాళ ధ్వనులు మారుమ్రోగాయి. విద్యార్థులు సాంకేతిక విద్య
అందిపుచుకోవాలన్నారు. వైద్య రంగంలో మనదేశంలోని
చరకసంహితప్రపంచానికి మార్గదర్శనమన్నారు. విద్యార్థులు తమ వ్యక్తిత్వ వికాసము ఎలా పెంపొందించు
కోవాలన్నారు. స్టెప్సి సిఇఓ సుబ్బారాయుడు
రాష్ట్ర ప్రభుత్వం యువతకు చేపట్టే కార్యక్రమాలు
వివరించారు.కళాశాల కరెస్పాండెంట్ మన్నూరు భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు
కల్పిస్తున్నామన్నారు.
గత 3 సంవత్సరాలుగా తమ ఫార్మశి కళాశాలలో అన్ని సీట్లు
పూర్తయ్యాయని రాయలసీమలో ప్రథమ స్థానమన్నారు.
ఈ ప్రాంత ప్రజల అవసర దృష్ట్యా ఫార్మశి కళాశాల ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులుగా మీరు బాగా చదివి అత్యున్నత స్థానానికి యాదగాలన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ రెడ్డి,త్రినాయ్ ఫార్మసి కళాశాల ప్రిన్సిపాల్ నాగేంద్ర,అడ్మినిస్ట్రేటివ్ అధికారి జలజ. అనంతపురం ఫార్మశి కళాశాల ప్రన్సిపల్ మస్తానయ్య పసుపులేటి సుబ్బారామయ్య,
రాయచోటి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఇషాక్, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అనంతరం
డాక్టర్ పసుపులేటి
శంకర్ ను కళాశాల
యాజమాన్యం ఘనంగా సత్కరించారు.
జాతీయ గీతాలాపనతో ముగిసింది

