గీతాంజలి విద్యసంస్థల అధినేత ఎస్వి రమణను అభినందించిన టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి

Spread the love

సమాజానికి సేవలు అందిస్తూ తండ్రి తగ్గ తనయుడిగా నిలిచాడని ఎస్వి వినయ్ ని ప్రశంసించిన చమర్తి

గీతాంజలి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 11

(నవ్యంధ్ర న్యూస్ )

మనిషికి క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు,
ఆరోగ్యన్ని ఇచ్చే క్రీడల పట్ల ప్రతి ఒక్కరు మక్కువ చూపినప్పుడే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు.
రాజంపేట మండల పరిధిలోని వెంకట్రాజంపేటలో గీతాంజలి విద్యా
సంస్థల అధినేత ఎస్వి రమణ ఆధ్వర్యంలో
గీతాంజలి ప్రీమియర్ లీగ్ సీజన్ – 4 క్రికెట్ టోర్నమెంట్ ను గురువారం తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ యువత క్రీడలలో రాణించాలన్నారు. యువక్రీడాకారులను ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం టోర్నమెంట్ నిర్వహించి
బహుమతులు అందచేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న ఎస్వి రమణ అభినందనీయుడన్నారు. తండ్రి బాటలోనే నడుస్తూ తండ్రి తగ్గ తనయుడిగా వినయ్ సమాజానికి సేవలు అందిస్తూన్నాడన్నారు
గీతాజలి విద్యసంస్థల అధినేత ఎస్వి రమణ మాట్లాడుతూ గీతాంజలి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్బంగా ఒక నెల ముందే ప్రారంభమై సంక్రాంతికి పూర్తి అవుతాయన్నారు.
టోర్నమెంట్
నిర్వాహకులు
మాట్లాడుతూ గీతాంజలి విద్యాసంస్థల అధినేత సంభావు వెంకట రమణ కుమారుడు యువనేత వినయ్ ఆర్థిక సహకారంతో నిర్వహించే ఈ క్రికెట్ టోర్నమెంట్ కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తూన్నరన్నారు. ఈ టోర్నమెంట్ లో రాజంపేట నియోజవర్గం నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పేరెన్నిక గన్నా 50 టీములు
పాల్గొంటున్నాయన్నారు.నెల రోజులు నిర్వహించే ఈ పోటీలలో పాల్గొనే అన్ని టీములకు అన్ని వసతులు కల్పించి మొదటి బహుమతిగా 50000/ వేల రూపాయలు.
రొండవ బహుమతిగా 30000/ వేలు
సంక్రాంతికి ముందు నిర్వహించే ఫైనల్ లో బహుకరిస్తారన్నారు.
అనంతరం కాసేపు క్రీడాకారులతో కలిసి చమర్తి జగన్ మోహన్ రాజు బ్యాటింగ్ చేశారు.
ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కూటమి నాయకులను
రమణ ఘనంగా సత్కారించి ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు తరిగోపుల లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లునాయుడు.
సంజీవ రావు,నాగేశ్వర్ నాయుడు,శామీర్ భాష, గుల్జార్ బాషా,నరసింహ. చెంగల్ రాయుడు, సుబ్రమణ్యం,అదృష్ట, అమీనేని అజయ్,హరి,
రాముయాదవ్,
డియ్యాల రమణ
నామ హరి,గోపాల్, సుధాకర్,వేణు,ఆనంద్,సతీష్ రాజు,ఈశ్వరయ్య, వరదయ్య,వెంకటస్వామి,శివ,పాండు,తేజ,మురళీ,సందీప్,శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *