అన్నమయ్య జిల్లా డిసెంబర్ 11
(నవ్యంధ్ర న్యూస్ )
జిల్లా కేంద్రములోని బిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం నిర్వహించే కళాశాల విద్యార్థుల ఫ్రెషర్స్ వేడుకలలో ముఖ్య అతిధిగా హిందూధర్మం టెంపుల్స్ ప్రేయర్ సొసైటీ ఆర్గనై్సేషన్ జాతీయ అధ్యక్షులు,ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి శంకర్ ను కళాశాల కరెస్పాండండ్ మన్నూరు భాస్కర్ ఆహ్వానించామని
హిందూ ధర్మం టెంపుల్ ప్రేయర్ సొసైటీ జాతీయ ఉపాధ్యక్షులు సోము కళానాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్బంగా శుక్రవారం నిర్వహించే
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసము వృత్తి నైపుణ్యము జాతీయ సమైక్యత దేశావారసత్వ సంపదలపైఉపన్యాసము ఉంటుందని,
ఈ సమావేశంలో
జిల్లా రెవిన్యూ అధికారి మధుసూదనరావు రాయచోటి ఫార్మసి కళాశాల ప్రిన్సిపాల్ తదితరులుపాల్గొంటారని కళానాధ రెడ్డి తెలిపారు.

