అన్నమయ్య జిల్లా డిసెంబర్ 10
(నవ్యంధ్ర న్యూస్ )
జిల్లా కేంద్రంగా రాజంపేట ను ప్రకటుంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబును శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు కోరుతూ వినతి పత్రం అందజేశారు.
రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు మర్యాదపూర్వకంగా కలసి జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా ముఖ్యమంత్రికి పోతుగుంట రాజంపేటలో ఉన్న సౌకర్యలను వివరించారు అన్నమయ్య జిల్లా రాయచోటికి రైల్వే కోడూరుకి మధ్యలో ఉన్న ప్రాంతం రాజంపేట అని రాజంపేట ఇప్పటికే రైలు కనెక్టివిటీ రోడ్డు కనెక్టివిటీ మంచినీటి సౌకర్యం ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించు కోవడానికి కావలసినంత ప్రభుత్వ భూములు నగరం నడిబడ్డన కలవని
మంచి ప్రశాంతమైన వాతావరణం ఉండి రెండు అసెంబ్లీలకు మధ్యలో ఉన్న రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరారు.
ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిచ్చారని పోతుగుంట తెలిపారు.

