అన్నమయ్య జిల్లా డిసెంబర్ 10
(నవ్యంధ్ర న్యూస్ ).
రాజంపేట పట్టణంలోని రోడ్ల భవనాల అతిథి గృహంలో నియోజవర్గ కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి వైద్య కళాశాలల ప్రవేటికరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రతులను బుధవారం వాహనంలో తరలించే సందర్బంగా వైసీపీ శ్రేణులు నిర్వహిస్తూన్న ద్విచక్ర వాహన ర్యాలీని జిల్లా అధ్యక్షులు,స్థానిక శాసన సభ్యులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ ద్విచక్ర ర్యాలీ పట్టణ, రాయచోటి రోడ్డు శివార్ల వరకు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,నాయకులు కార్యకర్తలు,
అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

