ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక,శ్రీ బాలసుబ్రమణ్య స్వాముల సంకష్టహర చతుర్థి వ్రత పూజ

Spread the love

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 08

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట పట్టణంలోని ఈడిగపాలెంలో వెలసియున్న శ్రీ వరసిద్ధి వినాయక,శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రతినెల నిర్వహించి సంకష్టహర చతుర్థి పూజలో భాగంగా సోమవారం సాయంత్రం సంకష్టహర చతుర్థి
పూజను ఆలయ వ్యవస్థాపకులు మలిశెట్టి చంద్రమౌళి ఘనంగా నిర్వహించారు.
శ్రీ మహాగణపతి అభిషేక, సంకటహర చతుర్థి పూజలలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. సంకట చతుర్థి పూజలో పాల్గొన్న భక్తులకు
శ్రీ మహాగణపతి కృపాకటాక్షాలు కలగాలని ఆలయ వ్యవస్థాపకులు మలిశెట్టి చంద్రమౌళిఆకాంక్షించారుఈ సందర్బంగా చంద్రమౌళి మాట్లాడుతూ ప్రతి నెల ఆలయంలో నిర్వహించే సంకష్టహర చతుర్థి వ్రతములో పాల్గొనేందుకు ఎలాంటి రుసుముచెల్లించ
నవసరంలేదన్నారు. భక్తులు వారి వారి సౌకర్యాన్ని బట్టి వివిధ రకాల పత్రాలు, పూలు, టెంకాయలు,పాలు, పెరుగు,తేనె,చక్కెర, నెయ్యి,పండ్లు తదితర పూజా సామాగ్రితో పాటు స్వామివారికి అన్న ప్రసాదము,కుడుములుతో పూజలో పాల్గొన్నాలన్నారు సంకష్టహర చతుర్థి వ్రతములో పాల్గొనడం వల్ల సకల శుభములు కలుగుతాయని
పురాణాలు తెలియ
జేస్తున్నాయన్నారు.
ఈ పూజలలో శ్రీ మహా గణపతికి
పంచామృతభిషేకంతో పాటు ద్వారపూజ,
పీఠపూజ,ఆధార్ శక్తి పూజ,అష్టాదళ పూజ, దుర్వాయుగ్మపూజ మార్గశిర మాస సంకటహర చతుర్థి వ్రత పూజా కథను భక్తులకు వినిపించారు.భక్తులకు ప్రసాద్సాయంత్రం భక్తులకు ప్రసాద వినియోగం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *